నటీనటుల పార్లమెంటు హాజరులో…. కిరణ్‌ఖేర్ ముందు...రేఖ అట్టడుగున!
సినిమారంగంనుండి రాజకీయాల్లోకి ప్రవేశించి…ఎంపిలయిన నటీ నటుల్లో కిరణ్ ఖేర్… పార్లమెంటు సభలకు ఎక్కువగా హాజరయిన ఘనతని దక్కించుకున్నారు. ఈ విషయంలో నటి రేఖ చివరి స్థాయిలో ఉన్నారు. పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చి అనే స్వచ్ఛంద సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. చండీగఢ్ నుండి పార్లమెంటుకి ఎన్నికైన ఖేర్ 85 శాతం హాజరుతో ఇతర నట ఎంపీల కంటే ముందున్నారు. ఆమె తరువాత 76 శాతం హాజరుతో బిజెపి ఎంపి పరేష్ రావల్, టిఎమ్‌సి నాయకురాలు నటి శతాబ్దిరాయ్, […]
సినిమారంగంనుండి రాజకీయాల్లోకి ప్రవేశించి…ఎంపిలయిన నటీ నటుల్లో కిరణ్ ఖేర్… పార్లమెంటు సభలకు ఎక్కువగా హాజరయిన ఘనతని దక్కించుకున్నారు. ఈ విషయంలో నటి రేఖ చివరి స్థాయిలో ఉన్నారు. పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చి అనే స్వచ్ఛంద సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. చండీగఢ్ నుండి పార్లమెంటుకి ఎన్నికైన ఖేర్ 85 శాతం హాజరుతో ఇతర నట ఎంపీల కంటే ముందున్నారు.
ఆమె తరువాత 76 శాతం హాజరుతో బిజెపి ఎంపి పరేష్ రావల్, టిఎమ్‌సి నాయకురాలు నటి శతాబ్దిరాయ్, భోజపురి నటుడు గాయకుడు బిజెపి ఎంపి మనోజ్ తివారీ ఉన్నారు. లోక్ సభ ఎంపిల సగటు హాజరు 82శాతం అయితే రాజ్యసభ సభ్యుల సగటు హాజరు 79శాతంగా ఉంది. నటి హేమమాలిని హాజరు 37శాతం ఉంది. ఆమె పది చర్చల్లో పాల్గొని 113 ప్రశ్నలు అడిగారు. నటుడు దేవ్ అధికారి హాజరు 9శాతం మాత్రమే. అగ్నిషపథ్ నటుడిగా గుర్తింపుపొందిన దేవ్ ఒక్క చర్చలో మాత్రమే పాల్గొన్నాడు….ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఇక నటుడు మిథున్ చక్రవర్తి పార్లమెంటు హాజరు అతి తక్కువగా 10శాతం ఉంది. 2014 ఏప్రిల్‌లో పార్లమెంటుకి వెళ్లిన 66ఏళ్ల ఈ నటుడు ఒక్క డిబేట్‌లోనూ పాల్గొనలేదు…ఒక్క ప్రశ్నా అడగలేదు. మిథున్ కంటే అతి తక్కువగా నటి రేఖ హాజరు 5శాతంగా ఉంది. మున్‌మున్ సేన్, తపస్‌పాల్ ల హాజరు 70శాతం, 64శాతం గా ఉంది. వినోద్ ఖన్నా పార్లమెంటు అటెండెన్స్ 59శాతంగా, జయాబచ్చన్ హాజరు 74శాతంగా ఉంది.
Click on Image to Read: