మోదీకి రఘురామ్ రాజన్ ఆఖరు చురకలు!
మోదీ ప్రవేశ పెడుతున్న పథకాలపై మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్. త్వరలోనే ఈయన పదవీకాలం ముగియబోతుంది. ఈ క్రమంలో మరోసారి మోదీ సర్కారుకు పరోక్షంగా చురకలు అంటించారు రాజన్. ప్రపంచంలో ఏవీ ఉచితంగా లభించవు అన్న ప్రాథమిక ఆర్థిక సూత్రాన్ని ప్రస్తావిస్తూ మోదీ సర్కారుకు వాతలు పెట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు తిరిగి మూలధనం సమకూర్చేందుకు ఆర్బీఐ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డివిడెండు తీసుకుంటే బాగుంటందన్న ఆలోచన సరైంది […]
మోదీ ప్రవేశ పెడుతున్న పథకాలపై మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్. త్వరలోనే ఈయన పదవీకాలం ముగియబోతుంది. ఈ క్రమంలో మరోసారి మోదీ సర్కారుకు పరోక్షంగా చురకలు అంటించారు రాజన్. ప్రపంచంలో ఏవీ ఉచితంగా లభించవు అన్న ప్రాథమిక ఆర్థిక సూత్రాన్ని ప్రస్తావిస్తూ మోదీ సర్కారుకు వాతలు పెట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు తిరిగి మూలధనం సమకూర్చేందుకు ఆర్బీఐ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డివిడెండు తీసుకుంటే బాగుంటందన్న ఆలోచన సరైంది కాదని రాజన్ అన్నారు. ఎప్పుడూ ఏదీ ఉచితంగా లభించవని హితవు పలికారు.
‘మూలధన రాబడి, ప్రభుత్వ ఆస్తులపై వడ్డీ, మార్కెట్ పార్టిసిపెంట్ల ద్వారా ఆర్‌బీఐకి మిగులు రాబడి ఉంటుంది. డివిడెండ్ల రూపంలో దానిని తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తే సొమ్ము లభించిన వ్యవస్థలోకే మళ్లీ ఇవ్వడమన్న మాట. ప్రభుత్వానికి డివిడెండ్లు చెల్లిస్తే మనం శాశ్వత అదనపు నిధులు సృష్టించాలి లేదా డబ్బులు ముద్రించాలని అన్నారు. రాజన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆర్థిక సూత్రాలను వివరించినట్లుగానే ఉన్నా.. ప్రభుత్వానికి డెవిడెండ్లు చెల్లించడం సరికాదన్న తన అభిమతాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని నిపుణులు భావిస్తున్నారు.
Click on Image to Read: