పేదలు ఏం తినాలి...ఆటానా...డాటానా? " లాలూ ప్రసాద్ యాదవ్
రిలయన్స్ జియో తో దేశం డిజిటల్ ఇండియాగా మారాలనే ప్రధాని మోడీ కల నిజమవుతుందని…. ఆ కంపెనీ చెబుతుండగా…రిలయన్స్ జియో ప్రకటనల్లో మోడీ కనిపించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మోడీని మిస్టర్ రిలయన్స్‌గా పేర్కొనగా ఇప్పుడు బీహార్ రాజకీయ ప్రముఖుడు, ఆర్జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సైతం ఈ ప్రకటనను విమర్శించారు. దీనిపై ట్విట్టర్లో హిందీలో స్పందించిన లాలూ, పేదలు ఏం తినాలి…ఆటా (గోధుమ పిండి)నా…లేదా డాటానా? […]
రిలయన్స్ జియో తో దేశం డిజిటల్ ఇండియాగా మారాలనే ప్రధాని మోడీ కల నిజమవుతుందని…. ఆ కంపెనీ చెబుతుండగా…రిలయన్స్ జియో ప్రకటనల్లో మోడీ కనిపించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మోడీని మిస్టర్ రిలయన్స్‌గా పేర్కొనగా ఇప్పుడు బీహార్ రాజకీయ ప్రముఖుడు, ఆర్జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సైతం ఈ ప్రకటనను విమర్శించారు.
దీనిపై ట్విట్టర్లో హిందీలో స్పందించిన లాలూ, పేదలు ఏం తినాలి…ఆటా (గోధుమ పిండి)నా…లేదా డాటానా? అని ప్రశ్నించారు. ఆటాకంటే డాటా చౌకగా మారిపోయింది. దేశం మారిపోవటం అంటే ఇదే. మీరు ఇందులో ఉంటే…కాల్డ్రాప్స్ సమస్యని ఎవరు తీరుస్తారు…అని లాలూ ప్రశ్నించారు. కాంగ్రెస్ సైతం..ఈ విషయంలో రిలయన్స్…. ప్రధానమంత్రి కార్యాలయం నుండి అనుమతి తీసుకుందా…అని ప్రశ్నించింది. అలా తీసుకుని ఉండకపోతే వారిపై చట్టబద్దమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ పేర్కొంది.
Click on Image to Read: