కూతురి శవంతో ఆరు కిలోమీటర్ల నడక... మారని ఒడిషా పరిస్థితి!
ఒడిషా కలాహండీ జిల్లాకు చెందిన గిరిజనుడు దానా మాఝి భార్య శవాన్ని మోస్తూ పది కిలోమీటర్లు పైగా నడిచిన సంఘటన ఇంకా మన కళ్లముందు కదులుతుండగానే…అలాంటిదే మరొక ఘటన అదే ఒడిషాలో జరిగింది. ఈ సారి మల్కాన్‌గిరి జిల్లా ఖైరాపుట్ బ్లాక్, పస్పలి గ్రామానికి చెందిన నిరుపేద గిరిజనుడు… మరణించిన ఆరేళ్ల కుమార్తె శవాన్ని మోస్తూ ఆరు కిలోమీటర్లు నడిచాడు. 108 అంబులెన్స్ అతడిని మార్గ మధ్యంలో దింపేసి వెళ్లిపోవటంతో ముకుంద్ ఖేముడు అనే నిరుపేద అలా […]
ఒడిషా కలాహండీ జిల్లాకు చెందిన గిరిజనుడు దానా మాఝి భార్య శవాన్ని మోస్తూ పది కిలోమీటర్లు పైగా నడిచిన సంఘటన ఇంకా మన కళ్లముందు కదులుతుండగానే…అలాంటిదే మరొక ఘటన అదే ఒడిషాలో జరిగింది. ఈ సారి మల్కాన్‌గిరి జిల్లా ఖైరాపుట్ బ్లాక్, పస్పలి గ్రామానికి చెందిన నిరుపేద గిరిజనుడు… మరణించిన ఆరేళ్ల కుమార్తె శవాన్ని మోస్తూ ఆరు కిలోమీటర్లు నడిచాడు. 108 అంబులెన్స్ అతడిని మార్గ మధ్యంలో దింపేసి వెళ్లిపోవటంతో ముకుంద్ ఖేముడు అనే నిరుపేద అలా చేయాల్సివచ్చింది.
శుక్రవారం మధ్యాహ్నం ముకుంద్, తన ఆరేళ్ల కూతురు బార్షా శవాన్ని మోస్తూ…మాథిలి బ్లాక్లోని నాయక్గూడ గ్రామస్తులకు కనిపించాడు. బార్షాకి ఆరోగ్యం బాగాలేకపోవటంతో మొదట మాధిలి బ్లాక్లోని కమ్యునిటీ హెల్త్ సెంటర్లో చేర్చాడు ముకుంద్. తరువాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో మల్కాన్‌గిరి జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లమని గురువారం రాత్రి వైద్యులు సూచించారు. ముకుంద్ 108 అంబులెన్స్లో కూతురిని ఆ ఆసుపత్రికి తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలోనే ఆమె పరిస్థితి సీరియస్గా మారింది. దాంతో మార్గ మధ్యంలో ఉన్న పందిరిపాణి కమ్యునిటీ హెల్త్ సెంటర్కి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యుడు పాప మరణించినట్టుగా చెప్పాడు.
తరువాత మాథిలి కమ్యునిటీ హెల్త్ సెంటర్కి తిరిగి వెళుతున్న ఆ అంబులెన్స్లో…. ముకుంద్ని ఎక్కించుకున్న డ్రైవర్…అతడిని కుమార్తె శవంతో సహా పందిరిపాణికి మాథిలికి మధ్యలో ఉన్న నాయక్గూడలో దింపేసి… తాను మాథిలివైపు వెళ్లిపోయాడు. చేసేదేమీ లేక ముకుంద్ కుమార్తె శవంతో పాటు తన ఊరు పస్పలి వైపు నడుస్తుండగా నాయక్గూడ వాసుల కంటబడింది ఆ దయనీయమైన దృశ్యం. దాంతో వారు ఈ విషయాన్ని మాథిలి బ్లాక్ డెవలప్మెంట్ అధికారికి తెలియజేయటంతో ఆయన ముకుంద్కి మరొక అంబులెన్స్ని ఏర్పాటు చేయించారు.
ఈ విషయం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో…108, 102 అంబులెన్స్ సర్వీసుల అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. ఈ సర్వీసుల హెడ్ సబ్యసాచి బిశ్వాల్ మాట్లాడుతూ…ఒడిషా ఎమర్జన్సీ మెడికల్ అంబులెన్స్ సర్వీస్ నిర్వహణకు సంబంధించిన పద్ధతుల ప్రకారం ఆ సర్వీసులు…అనారోగ్యంతో ఉన్నవారి కోసమే తప్ప…మరణించాక శవాలను తీసుకువెళ్లాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు.
అయితే మల్కాన్ గిరి జిల్లా కలెక్టర్ సుదర్శన్ చక్రవర్తి అంబులెన్స్ డ్రైవర్మీద క్రిమినల్ నేరంకింద కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే జిల్లా ప్రధాన వైద్యాధికారిని సైతం ఈ విషయంమీద విచారణ జరిపించి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. అంబులెన్స్ సర్వీస్‌కి శవాన్ని తీసుకువెళ్లాల్సిన బాధ్యత లేకపోతే పందిరిపాణి కమ్యునిటీ హెల్త్ సెంటర్ నుండి ఎందుకు తెచ్చారని….30 కిలోమీటర్లు తీసుకువచ్చాక మధ్యలో వదిలేసిపోవటం ఏమిటని కలెక్టర్ ప్రశ్నించారు. ఆ డ్రైవర్ మొదటే కుదరదని చెప్పిఉంటే… ముకుంద్ మరొక రవాణా సదుపాయం సమకూర్చుకునేవాడని కలెక్టర్ అన్నారు.
Click on Image to Read: