కేసీఆర్, హరీష్ రావు , కేటీఆర్ ఎవరైనా ఓకే.... డీకే అరుణ సవాల్
తెలంగాణలో కొత్త జిల్లాల అంశంపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వదిలిపెట్టేలాలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే అరుణ ముందున్నారే చెప్పాలి. గద్వాల్‌ని జిల్లాగా ప్రకటించాలని ఇదివరకే ధర్నాలు, రాస్తారోకోలు, పాదయాత్రలతో తన నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఇప్పుడు ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందంటూ పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ దీక్షలో కూర్చున్నారు. ఈ నేపధ్యంలో డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కొత్తగా […]
తెలంగాణలో కొత్త జిల్లాల అంశంపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వదిలిపెట్టేలాలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే అరుణ ముందున్నారే చెప్పాలి. గద్వాల్‌ని జిల్లాగా ప్రకటించాలని ఇదివరకే ధర్నాలు, రాస్తారోకోలు, పాదయాత్రలతో తన నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఇప్పుడు ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందంటూ పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ దీక్షలో కూర్చున్నారు. ఈ నేపధ్యంలో డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కొత్తగా ఏర్పాటుచేసే జిల్లాలను ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే చర్చకు రావాలన్నారు. ఈ చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు , కేటీఆర్ ఎవరైనా సరే రావొచ్చని ఆమె సవాలు విసిరారు.
Click on Image to Read: