మరో తిక్క టైటిల్ ఫిక్స్ చేసిన రవితేజ...?
తిక్క అనే టైటిల్ సాయిధరమ్ తేజ పెట్టేసుకున్నాడు. అటు మెంటల్ అనే టైటిల్ ను శ్రీకాంత్ వాడేశాడు. లేదంటే ఈ రెండు టైటిల్స్ తో రవితేజ సినిమా చేసేవాడు. ఇప్పటికే కిక్, కంఫర్ట్ తెగ గోల చేసిన మాస్ రాజా, తన నెక్ట్స్ సినిమాకు క్రాక్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి డిఫరెంట్ టైటిల్స్ పెట్టుకోవడం రవితేజకు కొత్తేంకాదు. హీరోగా కెరీర్ ఊపందుకున్న టైమ్ లోనే ఇడీయట్ అనే టైటిల్ తో సినిమా చేశాడు. […]
తిక్క అనే టైటిల్ సాయిధరమ్ తేజ పెట్టేసుకున్నాడు. అటు మెంటల్ అనే టైటిల్ ను శ్రీకాంత్ వాడేశాడు. లేదంటే ఈ రెండు టైటిల్స్ తో రవితేజ సినిమా చేసేవాడు. ఇప్పటికే కిక్, కంఫర్ట్ తెగ గోల చేసిన మాస్ రాజా, తన నెక్ట్స్ సినిమాకు క్రాక్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి డిఫరెంట్ టైటిల్స్ పెట్టుకోవడం రవితేజకు కొత్తేంకాదు. హీరోగా కెరీర్ ఊపందుకున్న టైమ్ లోనే ఇడీయట్ అనే టైటిల్ తో సినిమా చేశాడు. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా మరో క్రేజీ టైటిల్ వద్ద మాస్ రాజా ఆగిపోయాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రవితేజ కొత్త సినిమాకు క్రాక్ అనే టైటిల్ పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలోనే బాబి దర్శకత్వంలో సెట్స్ పైకి రాబోతున్న సినిమాకు ఈ పేరు పెట్టాలని బేసిక్ గా నిర్ణయించారు. ఇటీవల కొరియన్ భాషలో విడుదలైన ఓ సినిమా దర్శకుడు బాబితో పాటు రవితేజకు బాగా నచ్చింది. ఆ సినిమా స్ఫూర్తితో తెలుగులో సినిమా చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారట. ఆ నిర్ణయ ఫలితమే క్రాక్ సినిమా అని సమాచారం. ఈమధ్య కాలంలో ఏ సినిమాను ప్రకటించని రవితేజ, ఈ క్రాక్ తోనే సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే క్రాక్ ప్రాజెక్టుపై అధికారికంగా ఓ వార్త బయటకు రాబోతోంది. అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ లేదా రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు.
Click to read