కోదండరామ్ కు చెక్‌పెట్టేందుకే ఉద్యోగ నోటిఫికేషన్!
తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసి కొలువుల జాతర ప్రకటించింది. పాత, కొత్త ఖాళీలతో కలిపి ఏకంగా 1032 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు. రెండేళ్లుగా నోటిఫికేషన్ కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న యువత సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం అకస్మాత్తుగా నోటిఫికేషన్ జారీచేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీని వెనక మరో రకమైన వ్యూహం కూడా దాగి ఉందంటున్నారు పరిశీలకులు. […]
BY sarvi2 Sept 2016 3:49 AM IST
X
sarvi Updated On: 2 Sept 2016 5:55 AM IST
తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసి కొలువుల జాతర ప్రకటించింది. పాత, కొత్త ఖాళీలతో కలిపి ఏకంగా 1032 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు. రెండేళ్లుగా నోటిఫికేషన్ కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న యువత సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం అకస్మాత్తుగా నోటిఫికేషన్ జారీచేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీని వెనక మరో రకమైన వ్యూహం కూడా దాగి ఉందంటున్నారు పరిశీలకులు. కొత్త రాష్ట్రంలో కొలువులు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంలో యువకులను చేరదీసి త్వరలోనే భారీ ఉద్యమాన్ని చేపడతామని కోదండరామ్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని విమర్శలతో ఉతికి ఆరేస్తున్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. గ్రూప్-2 నోటిఫికేష్ జారీ చేయడం ద్వారా ఇటు ప్రతిపక్షాలకు, అటు కోదండరామ్‌కు ఒకేసారి చెక్ పెట్టారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
తెలంగాణలో కొత్త ఉద్యోగాల కోసం దసరా నుంచి ఉద్యమం చేపడతామని కోదండరామ్ గతంలోనే చెప్పారు. ఈ విషయంలో విద్యార్థులతోపాటు, కాంట్రాక్టు ఉద్యోగులు తదితర అన్నివర్గాలను కలుపుకొని పోరాటం సాగిస్తామని చెప్పారు. ఈ విషయంలో అప్పట్లోనే ప్రభుత్వం ఆందోళన చెందినట్లుగా కనిపించింది. కానీ, ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తపడింది. తెలంగాణ ఆవిర్భావ తొలివేడుకలకు ముందు కూడా ఇలాగే జరిగింది. మొదటి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో నిరుద్యోగులు శుభవార్త వినాలనుకుంటున్నారని కోదండరామ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపై స్పందించిన కేసీఆర్ తొలివేడుకల సందర్భంగా కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ సమయంలో కేసీఆర్ – కోదండరామ్ మధ్య విభేదాలు ఉన్నా.. మరీ బహిరంగంగా విమర్శించే స్థాయిలో లేవు. ఇప్పుడు ఆయన వివిధ సమస్యల సాధనకు ప్రభుత్వంపై పోరాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన నిరుద్యోగులు, విద్యావంతులను కలుపుకుని పోతే.. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని ప్రభుత్వం గ్రహించింది. అందుకే, గ్రూప్స్-2 పరిధిలో పాత, కొత్త ఖాళీల జాబితా తెప్పించుకుని వాటికి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్షాలకు కూడా ఈ విషయంపై అవకాశం లేకుండా చేశారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Next Story