కోల్‌బెల్ట్ ప్రాంతంలో కేసీఆర్ పై పెరుగుతున్న వ్యతిరేకత!
సింగరేణి ప్రాంతంలో ప్రభుత్వ తీరుపై కొన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి రేగుతోంది. ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాల విషయంలో వేలాదిమంది యువకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వాల హయాంలో వారసత్వ ఉద్యోగాల హక్కును సింగరేణి కార్మికులు కోల్పోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ ఒక్క హామీ సింగరేణి ఉద్యోగులను ఉద్యమంలో పాల్గొనేలా చేసింది. ఉద్యమంలో భాగంగా పలుమార్లు సమ్మెకు కూడా దిగారు. సకల జనుల సమ్మె సమయంలో పలుమార్లు […]
BY sarvi2 Sept 2016 4:44 AM IST
X
sarvi Updated On: 2 Sept 2016 7:28 AM IST
సింగరేణి ప్రాంతంలో ప్రభుత్వ తీరుపై కొన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి రేగుతోంది. ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాల విషయంలో వేలాదిమంది యువకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వాల హయాంలో వారసత్వ ఉద్యోగాల హక్కును సింగరేణి కార్మికులు కోల్పోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ ఒక్క హామీ సింగరేణి ఉద్యోగులను ఉద్యమంలో పాల్గొనేలా చేసింది. ఉద్యమంలో భాగంగా పలుమార్లు సమ్మెకు కూడా దిగారు. సకల జనుల సమ్మె సమయంలో పలుమార్లు సింగరేణిలో సమ్మె సైరన్ మోగించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. తరువాత ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. వారసత్వ ఉద్యోగాల కల నెరవేరబోతోందని కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఎంతగానో సంబరపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతోపాటు కార్మిక సంఘాల ఎన్నికల్లోనూ టీఆర్ ఎస్‌కే పట్టం కట్టారు.
తెలంగాణ వచ్చి రెండేళ్లవుతున్నా.. వారసత్వ ఉద్యోగాల విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. తమకు తప్పకుండా ఉద్యోగాలు వస్తాయన్న దీమాతో వేలాదిమంది యువకులు ఇతర ఉద్యోగాలు చేయకుండా కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఇటీవల జరిగిన బొగ్గు గని కార్మిక గుర్తింపు సంఘాల ఎన్నికల్లోనూ ఈ అంశం టీఆర్ ఎస్ అనుబంధ యూనియన్ టీజేబీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) ను కొద్దిగా ఇబ్బంది పెట్టింది. ఇదే హామీతో మరోసారి విజయం సాధించిన టీజేబీకేఎస్ కు పలు చోట్ల నిరసనలు ఎదురవుతున్నాయి. విజయోత్సవ ర్యాలీలు, సభలునిర్వహించిన చోటల్లా ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు. ఇది ఘర్షణలకు దారి తీస్తోంది. మొన్న ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. దీంతో సోషల్ మీడియాలో కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు యువకులు.
Next Story