తెలుగువారి కోసం ఇళయరాజా కార్యక్రమం
సంగీత జ్ఞాని ఇళయరాజా ఎన్నో తెలుగు సినిమాలకు సంగీతం అందించారు. కానీ ఆయన నేరుగా తెలుగులో చేసిన సంగీత కచేరీ మాత్రం ఏదీ లేదు. ఇళయరాజా స్టేజ్ షో అంటే అందులో తమిళ పాటలే ఎక్కువగా ఉంటాయి. కానీ తొలిసారిగా ఇళయరాజాతో కేవలం తెలుగు పాటలతో ఓ వేడుక జరగనుంది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో కేవలం తెలుగువారి కోసం ఓ కార్యక్రమం నిర్వహించడానికి ఇళయరాజా అంగీకరించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రకాష్ రాజ్ వ్యవహరించడం విశేషం. […]
సంగీత జ్ఞాని ఇళయరాజా ఎన్నో తెలుగు సినిమాలకు సంగీతం అందించారు. కానీ ఆయన నేరుగా తెలుగులో చేసిన సంగీత కచేరీ మాత్రం ఏదీ లేదు. ఇళయరాజా స్టేజ్ షో అంటే అందులో తమిళ పాటలే ఎక్కువగా ఉంటాయి. కానీ తొలిసారిగా ఇళయరాజాతో కేవలం తెలుగు పాటలతో ఓ వేడుక జరగనుంది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో కేవలం తెలుగువారి కోసం ఓ కార్యక్రమం నిర్వహించడానికి ఇళయరాజా అంగీకరించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రకాష్ రాజ్ వ్యవహరించడం విశేషం. ఈనెల 10వ తేదీన ఈ కార్యక్రమం జరగనుంది. బే ఏరియా తెలుగు అసోసియేషన్, స్వాగత్ ఎంటర్‌టైన్‌మెంట్, లావణ్య దువ్వి, యు స్మైల్ డెంటల్ ఆధ్వర్యంలో ఈ కాన్సర్ట్ జరగనుంది.
ఇప్పటిదాకా ఇళయరాజాగారు యుఎస్ ఎ లో పలు సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. మరీ ముఖ్యంగా 2013లో యుఎస్ ఎ లో ఓ సారి కాన్సర్ట్ చేశారు. తాజాగా మరో 5 ప్రోగ్రామ్‌లను నిర్వహించడానికి కూడా అంగీకరించారు. అయితే అవన్నీ తెలుగు, తమిళం కలగలిపిన పాటలతో ఉంటాయి. కానీ సెప్టెంబర్ 10న మేం నిర్వహిస్తున్న కార్యక్రమం మాత్రం సంపూర్ణంగా తెలుగువారి కోసమే. ఇందులో ఇళయరాజాగారి ఆధ్వర్యంలో తెలుగు పాటలను మాత్రమే పాడతారు. సినిమా పరిశ్రమలో సంగీత దర్శకుడిగా వెయ్యి చిత్రాల మైలు రాయిని దాటుతున్న తరుణంలో ఇసైజ్ఞాని, పద్మభూషణ్ ఇళయరాజాగారు మాకోసం ఈ కార్యక్రమాన్ని అంగీకరించడం చాలా ఆనందంగా ఉందని నిర్వహకులు తెలిపారు.
Click to read