భూమనకు సీఐడీ నోటీసులు జారీ... ప్రతీకారమేనా?
వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల నాలుగున విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తుని కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. తుని ఘటనలో రాయలసీమ ముఠాలు, వైసీపీ నేతల హస్తముందని అప్పట్లో చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి… ముద్రగడను పదేపదే కలిశారని అధికార పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. భూమనతో పాటు మొత్తం 20మందికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 4న రాజమండ్రి లేదా గుంటూరులో […]
వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల నాలుగున విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తుని కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. తుని ఘటనలో రాయలసీమ ముఠాలు, వైసీపీ నేతల హస్తముందని అప్పట్లో చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి… ముద్రగడను పదేపదే కలిశారని అధికార పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. భూమనతో పాటు మొత్తం 20మందికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 4న రాజమండ్రి లేదా గుంటూరులో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. నోటీసులు అందుకున్న వారిలో నెంబర్ వన్ చానల్ అధినేత మంచాల సుధాకర్ నాయుడు కూడా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే తుని కేసులో భూమనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే తనకు నోటీసులు జారీ చేయడం కుట్రలో భాగమేనని భూమన ఆరోపించారు. ప్రత్యేక హోదా నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు నోటీసులు జారీ చేశారని అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్టుకు వెళ్లడం… కోర్టు కూడా విచారణకు ఆదేశించడం వంటి పరిణామాలకు ప్రతీకారంగానే వైసీపీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. చూడాలి భూమన కరుణాకర్ రెడ్డిని విచారణకు పిలిచిన సీఐడీ ఆ తర్వాత ఎలా ముందుకెళ్తుందో?. దీనిపై కాపు నేత ముద్రగడ వర్గం నుంచి ఎలాంటి స్పందన వస్తోందో?
Click on Image to Read: