మిస్టర్ రిలయన్స్‌గా ప్రధాని...
ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా కలలను… రిలయన్స్ జియో నిజం చేస్తుందని చెబుతున్న ముఖేష్ అంబానీ… ఏకంగా ప్రధాని నరేంద్రమోడీనే రిలయన్స్ జియో సేవలకు ప్రచారకర్తగా వాడేసుకున్నారు. రిలయన్స్ జియో ప్రకటనలో నరేంద్ర మోడీ బొమ్మ కనిపించి చూసేవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. గురువారం ముఖేష్ అంబానీ ముంబైలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ జియో దేశవ్యాప్త సేవలను ప్రారంభిస్తూ…ఆఫర్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దీనిపై రిలయన్స్ కంపెనీ జాతీయ వార్తా పత్రికల్లో ఫుల్‌పేజి ప్రకటనను […]

ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా కలలను… రిలయన్స్ జియో నిజం చేస్తుందని చెబుతున్న ముఖేష్ అంబానీ… ఏకంగా ప్రధాని నరేంద్రమోడీనే రిలయన్స్ జియో సేవలకు ప్రచారకర్తగా వాడేసుకున్నారు. రిలయన్స్ జియో ప్రకటనలో నరేంద్ర మోడీ బొమ్మ కనిపించి చూసేవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. గురువారం ముఖేష్ అంబానీ ముంబైలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ జియో దేశవ్యాప్త సేవలను ప్రారంభిస్తూ…ఆఫర్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దీనిపై రిలయన్స్ కంపెనీ జాతీయ వార్తా పత్రికల్లో ఫుల్‌పేజి ప్రకటనను ఇచ్చింది. అందులో నరేంద్రమోడీ ప్రచారకర్తగా కనిపించడంతో ప్రజలు అశ్చర్యపోతున్నారు.
భారత్‌కి…120 కోట్ల భారతీయులకు అంకితం…అనే క్యాప్షన్‌ని ఈ ప్రకటనకోసం వాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దీనిపై స్పందిస్తూ… మిస్టర్ రిలయన్స్‌గా ప్రధాని… అంటూ ట్వీట్ చేశారు. మోడీజీ మీరు రిలయన్స్‌కి ప్రచారం చేస్తున్నారు…. ఈ దేశ ప్రజలు మీకు 2019లో గుణపాఠం చెబుతారు…అని కూడా ట్విట్టర్లో పేర్కొన్నారు. రిలయన్స్ ప్రకటనలో మోడీ కనిపించడం పై కేజ్రీవాలే కాదు….ఇది ఎలా చట్టబద్ధమవుతుందని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
Click on Image to Read: