బాలీవుడ్ లో పనిచేయని మురగదాస్ స్టోరి...
సౌత్ ఇండియాలో బెస్ట్ స్ర్రీన్ ప్లే రైటర్స్ లో దర్శకుడు మురగదాస్ ఒకరు. తెలుగులో నేరుగా స్టాలిన్ చిత్రం చేసిన మురగదాస్.. ఆయన తమిళ్ లో చేసిన ప్రతి చిత్రం టాలీవుడ్ లో రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా సూర్య తో చేసిన గజని చిత్రం దర్శకుడిగా తన స్థాయిని.. ప్రతిభను ప్రపంచానికి చాటింది. హింది లో అమీర్ ఖాన్ తో సేమ్ స్టోరి ని రీమేక్ చేసి.. బాలీవుడ్ లో కూడా జెండా పాతాడు. తుపాకి సినిమాను అక్షయ్ […]
సౌత్ ఇండియాలో బెస్ట్ స్ర్రీన్ ప్లే రైటర్స్ లో దర్శకుడు మురగదాస్ ఒకరు. తెలుగులో నేరుగా స్టాలిన్ చిత్రం చేసిన మురగదాస్.. ఆయన తమిళ్ లో చేసిన ప్రతి చిత్రం టాలీవుడ్ లో రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా సూర్య తో చేసిన గజని చిత్రం దర్శకుడిగా తన స్థాయిని.. ప్రతిభను ప్రపంచానికి చాటింది. హింది లో అమీర్ ఖాన్ తో సేమ్ స్టోరి ని రీమేక్ చేసి.. బాలీవుడ్ లో కూడా జెండా పాతాడు. తుపాకి సినిమాను అక్షయ్ కుమార్ తో రీమేక్ చేశాడు. తాజాగా సోనాక్షి సిన్హా లీడ్ రోల్ లో అకీరా పేరు తో ఒక చిత్రాని చేశాడు. ఈ రోజు అకీరా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
కట్ చేస్తే సినిమా కథ గురించి ఆలోచన చేస్తే చాల గొప్ప ఆలోచన. ఆడ పిల్లలలకు డ్యాన్స్ నేర్పించడం కంటే..సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏదో ఒక మార్షల్ ఆర్ట్ నేర్పించడం చాలా ఉత్తమం అనే పాయింట్ తో అకీరా చిత్రం చేశాడు. అయితే లీడ్ రోల్ లో ఏమోషనల్ గ్రిప్పింగ్ లేక పోవడం.. సెకండాఫ్ మరీ గజిబిజిగా ఉండటం వెరసి ఒక యావరేజ్ సినిమాగా మిగిలింది. సోనాక్షి నటన బాగానే ఉన్నప్పటికి.. కథనంలో ఎమోషనల్ గ్రిప్ప్ లేక పోవడం మేజర్ డ్రా బ్యాక్. సోనాక్షి మాత్రమే ఈ చిత్రంలో క్రౌడ్ పుల్లింగ్ ఎలిమెంట్. అయితే మురగదాస్ స్టోరి, స్క్రీన్ ప్లే ఈ సారి బాలీవుడ్ లో పని చేయలేదన్నమాట.