కొడుకుల సినిమాలు కన్ ఫర్మ్ చేసిన మన్మధుడు
రెండో సినిమా కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు అఖిల్. ఏ దర్శకుడ్ని ఓకే చేయలేకపోతున్నాడు. అటు నాగచైతన్య ఒకేసారి రెండు సినిమాల్ని పూర్తిచేసి ఖాళీ అయిపోయాడు. దీంతో ఒకేసారి ఖాళీ అయిపోయిన ఇద్దరు కొడుకులపై నాగార్జున ఫోకస్ పెట్టాడు. చకచకా రెండు సినిమాల్ని ఓకే చేశాడు. చాన్నాళ్లుగా రెండో సినిమా కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కోసం దర్శకుడు విక్రమ్ కుమార్ ను సిద్ధం చేశాడు. ఇక నాగచైతన్య కోసం కల్యాణ్ కృష్ణను రంగంలోకి దించాడు. ఈ రెండు సినిమాల్ని […]

రెండో సినిమా కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు అఖిల్. ఏ దర్శకుడ్ని ఓకే చేయలేకపోతున్నాడు. అటు నాగచైతన్య ఒకేసారి రెండు సినిమాల్ని పూర్తిచేసి ఖాళీ అయిపోయాడు. దీంతో ఒకేసారి ఖాళీ అయిపోయిన ఇద్దరు కొడుకులపై నాగార్జున ఫోకస్ పెట్టాడు. చకచకా రెండు సినిమాల్ని ఓకే చేశాడు. చాన్నాళ్లుగా రెండో సినిమా కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కోసం దర్శకుడు విక్రమ్ కుమార్ ను సిద్ధం చేశాడు. ఇక నాగచైతన్య కోసం కల్యాణ్ కృష్ణను రంగంలోకి దించాడు. ఈ రెండు సినిమాల్ని ట్విట్టర్ వేదికగా నాగార్జున అధికారికంగా ప్రకటించాడు.
కుదిరితే ఈ రెండు సినిమాల్ని అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పైనే నిర్మించాలని నాగార్జున భావిస్తున్నాడు. వీటిలో నాగచైతన్య-కల్యాణ్ కృష్ణ సినిమా అందరూ ఊహించిందే. కానీ అఖిల్-విక్రమ్ కుమార్ సినిమా మాత్రం ఎవరూ ఊహించలేదు.. మొన్నటికి మొన్న హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా ఉంటుందని అఖిల్ ప్రకటించాడు. కానీ అగ్రిమెంట్ ప్రకారం హను రాఘవపూడి నితిన్ సినిమా వైపు వెళ్లిపోయాడు. దీంతో అప్పటికే విన్న విక్రమ్ కుమార్ కథకు నాగార్జున ఓకే చెప్పాడు. మనం సినిమాతో నాగార్జునను మెప్పించాడు విక్రమ్ కుమార్.
Click to read