ప్రేమలు...అక్రమ సంబంధాల హత్యల్లో...ఆ రాష్ట్రం ఫస్ట్!
ప్రేమలు, అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న హత్యల్లో తమిళనాడు ఇతర రాష్ట్రాలకంటే ముందున్నదని నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఈ రెండు కారణాల వల్ల జరుగుతున్న హత్యలు…రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం హత్యల్లో 17శాతం ఉన్నట్టుగా తేలింది. ఇతర రాష్ట్రాలకంటే తమిళనాడు ఈ తరహా హత్యల్లో ముందున్నట్టుగా తెలుస్తోంది. అయితే 2014లో ఈ రెండు కారణాల వలన జరిగిన హత్యలు 19.44 శాతం ఉండగా 2015లో కాస్త తగ్గాయి. రాష్ట్రంలో 2015లో మొత్తం 1748 హత్యలు […]
ప్రేమలు, అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న హత్యల్లో తమిళనాడు ఇతర రాష్ట్రాలకంటే ముందున్నదని నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఈ రెండు కారణాల వల్ల జరుగుతున్న హత్యలు…రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం హత్యల్లో 17శాతం ఉన్నట్టుగా తేలింది. ఇతర రాష్ట్రాలకంటే తమిళనాడు ఈ తరహా హత్యల్లో ముందున్నట్టుగా తెలుస్తోంది. అయితే 2014లో ఈ రెండు కారణాల వలన జరిగిన హత్యలు 19.44 శాతం ఉండగా 2015లో కాస్త తగ్గాయి. రాష్ట్రంలో 2015లో మొత్తం 1748 హత్యలు జరిగాయి. ఈ సంఖ్య 2014లో 1805గా ఉంది. దాంతో హత్యలు కూడా కాస్త తగ్గినట్టుగా కనబడుతోంది.
2015లో దేశవ్యాప్తంగా జరిగిన సీనియర్ సిటిజన్ల హత్యల్లో తమిళనాడు రెండవస్థానంలో ఉంది. ఇక్కడ ఈ ఒక్క ఏడాదే 168 మంది వృద్ధులు హత్యకు గురయ్యారు. 2014లో 173మంది వృద్ధులు హత్యకు గురయ్యారు. కులం కారణంగా 10 హత్యలు జరిగినట్టుగా తేలింది. ఇలాంటి హత్యలు జరిగిన ఇతర ఎనిమిది రాష్ట్రాల్లో ఇదీ ఒకటిగా ఉంది. 2014లో ఈ హత్యలు 18 జరిగాయి. పైన పేర్కొన్న తరహా హత్యల్లో తమిళనాడు ముందున్నా… 2015లో హింసాత్మక నేరాల విషయంలో దేశం మొత్తంమీద సగటు 26.7శాతం ఉంటే… ఈ నేరాల సగటు తమిళనాడులో 17.5శాతం మాత్రమే ఉంది. 2014లో ఈ నేరాల సగటు దేశంలో 26.6శాతం ఉంటే తమిళనాడులో 18.5 శాతంగా ఉంది. దీన్ని బట్టి ఇతర రాష్ట్రాల కంటే తమిళనాడులో… మొత్తంమీద హింసాత్మక నేరాల సంఖ్య తక్కువగానే ఉన్నా ప్రేమలు, అక్రమ సంబంధాలు, కులాల గొడవలు లాంటి విషయాల్లో మాత్రం నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
48 గంటల్లో మూడు దాడులు
గత 48 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఒక టీచరు హత్యకు గురికాగా ఇద్దరు యువతులపై దాడులు జరగడమే ఇందుకు నిదర్శనం. తూతుకుడి జిల్లాలో ప్రాన్సినా అనే 24ఏళ్ల టీచరుని కీగన్ అనే వ్యక్తి దారుణంగా పొడిచి చంపాడు. చర్చిలో ప్రార్థన చేయడానికి వచ్చిన ఫ్రాన్సినాపై దుండగుడు దాడిచేసి చంపేశాడు. ప్రేమించమంటూ వేధించిన కీగన్…ప్రాన్సినాకి పెళ్లి కుదిరిందని తెలియడంతో హత్య చేశాడు. తరువాత అతను ఒక నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
తిరుచ్చిలో కాలేజి విద్యార్థిని ఆర్ మోనికపై బాలమురుగన్ అనే వ్యక్తి హత్యా ప్రయత్నం చేశాడు. ఇతను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. బిఎస్సి మూడో సంవత్సరం చదువుతున్న మోనికపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం ఇతను కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. మోనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మోనిక తండ్రి హెడ్ కానిస్టేబుల్గా, తల్లి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. మొదట్లో మోనిక, బాలమురుగన్లు ప్రేమించుకున్నారని, మోనిక తండ్రి హెచ్చరించడంతో ఆమె అతడిని దూరంగా ఉంచిందని పోలీసుల విచారణలో తేలింది. మోనికమీద దాడిచేయగానే విషం తాగేసిన బాలమురుగన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మరో సంఘటనలో 19ఏళ్ల మెడికల్ కాలేజి విద్యార్థిని హనోడొనిస్పై పుదుచ్చేరిలోని ఒస్సుడులో… ప్రయివేటు మెడికల్ కాలేజి క్యాంపస్కి దగ్గరలో 19ఏళ్ల ఎజిలారసన్ అనే యువకుడు దాడి చేశాడు. యువతి చేతి మణికట్టువద్ద కత్తితో కోసి పరారయ్యాడు. వారిద్దరూ మొదట ప్రేమించుకున్నా…ఈ మధ్య ఏదో విషయంమీద గొడవ జరిగటంతో యువతి అతనితో మాట్లాడటం మానేసింది. ఎజిలారసన్ మాత్రం ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడని తెలిసింది. హనోడొనిస్ తన తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనోడొనిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఎజిలారసన్ పరారీలో ఉన్నాడు.
Click on Image to Read: