సచిన్ ఇచ్చిన కారుని...సాక్షి మాలిక్ వాడదట!
రియో ఒలింపిక్స్ విజేతలు పివి సింధు, సాక్షి మాలిక్‌లతో పాటు పుల్లెల గోపీచంద్, దీపా కర్మాకర్‌లకు… సచిన్ టెండుల్కర్ బిఎమ్ డబ్ల్యు కార్లను బహుకరించిన సంగతి తెలిసిందే. అయితే సాక్షి మాలిక్… సచిన్ ఇచ్చిన కారుని వాడబోవటం లేదు. ఆమె తన పాత కారునే వాడాలనుకుంటోంది. సచిన్ ఇచ్చిన కారులో సాక్షి… హర్యానా రోహతక్ వీధుల్లో అభిమానులకు కనిపించే అవకాశం లేదన్నమాట. ఇందుకు కారణం చెబుతూ…గ్లాస్గోలో 2014లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో వెండిపతకం సాధించినపుడు… తన తండ్రి […]
రియో ఒలింపిక్స్ విజేతలు పివి సింధు, సాక్షి మాలిక్‌లతో పాటు పుల్లెల గోపీచంద్, దీపా కర్మాకర్‌లకు… సచిన్ టెండుల్కర్ బిఎమ్ డబ్ల్యు కార్లను బహుకరించిన సంగతి తెలిసిందే. అయితే సాక్షి మాలిక్… సచిన్ ఇచ్చిన కారుని వాడబోవటం లేదు. ఆమె తన పాత కారునే వాడాలనుకుంటోంది. సచిన్ ఇచ్చిన కారులో సాక్షి… హర్యానా రోహతక్ వీధుల్లో అభిమానులకు కనిపించే అవకాశం లేదన్నమాట. ఇందుకు కారణం చెబుతూ…గ్లాస్గోలో 2014లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో వెండిపతకం సాధించినపుడు… తన తండ్రి తనకు బ్లూ రంగు వి డబ్ల్యు పోలో కారుని కొనిచ్చారని…తాను దాన్నే వాడాలని అనుకుంటున్నానని చెప్పింది. మరి సచిన్ ఇచ్చిన బిఎండబ్ల్యు కారుని ఏం చేస్తారని అడగ్గా…దాన్ని తన తండ్రికి బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా తెలిపింది. ఆయన తన కోసం ఎంతో త్యాగం చేసారని సాక్షి పేర్కొంది.
Click on Image to Read: