Telugu Global
NEWS

నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు...

చంద్రబాబు నిజంగా నిప్పైతే ఓటుకు నోటు కేసులో విచారణ ఆపాలంటూ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. విచారణ జరిగితే దోషిగా తేలడం ఖాయమని అందుకే చంద్రబాబు భయపడుతున్నారని ఆరోపించారు. సెక్షన్ 156(3) కింద ఎంతో మంది మహానుభావులు కూడా విచారణ ఎదుర్కొన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించుకోవాలన్నారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు మరోసారి కేంద్రం, కేసీఆర్‌ల కాళ్లు పట్టుకునేందుకు చంద్రబాబు సిద్దపడ్డారన్నారు. కేంద్రమంత్రిని అందరి దగ్గరికి పంపుతూ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. […]

నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు...
X

చంద్రబాబు నిజంగా నిప్పైతే ఓటుకు నోటు కేసులో విచారణ ఆపాలంటూ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. విచారణ జరిగితే దోషిగా తేలడం ఖాయమని అందుకే చంద్రబాబు భయపడుతున్నారని ఆరోపించారు. సెక్షన్ 156(3) కింద ఎంతో మంది మహానుభావులు కూడా విచారణ ఎదుర్కొన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించుకోవాలన్నారు.

ఈ కేసు నుంచి బయటపడేందుకు మరోసారి కేంద్రం, కేసీఆర్‌ల కాళ్లు పట్టుకునేందుకు చంద్రబాబు సిద్దపడ్డారన్నారు. కేంద్రమంత్రిని అందరి దగ్గరికి పంపుతూ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నుంచి బయటపడేందుకు కేసీఆర్ కాళ్ల వద్ద ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని విమర్శించారు. నిజంగా చంద్రబాబుకు దమ్ముంటే కేసు విచారణకు సిద్ధపడాలన్నారు. ఓటుకు నోటు కేసుపై ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశించడంతో చంద్రబాబు నిద్ర లేని రాత్రులు గడపుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. కేసులో పసలేదంటున్న చంద్రబాబు మరి హైకోర్టుకు ఎందుకు వెళ్లారని రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. విచారణ జరిగితే బండారం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు.

Click on Image to Read:

sakshi malik

janatha garage movie review 02

chandrababu naidu vote for note case

reliance jio

motkupalli narasimhulu

chandrababu vote for note case

karem shivaji

chandrababu naidu

somireddy

revanth reddy karimnagar jail

Stephenson

lokesh driver kondal reddy

chandrababu naidu ntr health university

guntru to anantapur water tankers

balakrishna car accident

governor narasimhan vote for note case chandrababu

undavalli-arun-kumar

First Published:  1 Sept 2016 10:51 AM IST
Next Story