యూట్యూబ్ లో వెదికి మరీ ఆత్మహత్య !
ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఎలా చనిపోవాలన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఈ యువకుడు యూట్యూబ్ లో సెర్చ్ చేయడం గమనార్హం. నల్లగొండ జిల్లా మోత్కూరుకు చెందిన నవీన్ కుమార్ (26) బీటెక్ పూర్తి చేశాడు. తన స్నేహితునితో చాలాకాలంగా ఎస్. ఆర్ నగర్‌లోని ఓ హాస్టళ్లో ఉండేవాడు. చాలాకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఇటీవల తన స్నేహితుడికి బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. […]
BY sarvi1 Sept 2016 2:30 AM IST
sarvi Updated On: 1 Sept 2016 5:44 PM IST
ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఎలా చనిపోవాలన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఈ యువకుడు యూట్యూబ్ లో సెర్చ్ చేయడం గమనార్హం. నల్లగొండ జిల్లా మోత్కూరుకు చెందిన నవీన్ కుమార్ (26) బీటెక్ పూర్తి చేశాడు. తన స్నేహితునితో చాలాకాలంగా ఎస్. ఆర్ నగర్‌లోని ఓ హాస్టళ్లో ఉండేవాడు. చాలాకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఇటీవల తన స్నేహితుడికి బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. అతను హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఈ పరిణామంతో నవీన్ మరింత ఒంటరివాడయ్యాడు. ఉద్యోగం రాలేదన్న వెలితి, కుటుంబ కలహాలతో విసిగి వేసారిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అతనికి ఎలా చావాలో తెలియలేదు. బతకాలని ఉన్నా.. అతని మనసులో ఉన్న వేదన చావు వైపే పురిగొల్పింది. అందుకే, ఎలా చావాలో తెలుసుకునేందుకు యూట్యూబ్‌లో వెదికాడు. గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నవీన్ మృతి అతని స్నేహితులను కన్నీరు పెట్టేలా చేసింది. చావు కోసం యూట్యూబ్‌లో వెదికిన నవీన్.. ఎలా బతకాలి? జీవితంలో ఎలా విజయం సాధించాలి? అన్న విషయాల కోసం వెదికి ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు.
Next Story