చైనా కమ్యునిస్టులు...కృష్ణుడిని కొలుస్తున్నారు!
కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ చైనా… 88.76మిలియన్ల పార్టీ సభ్యత్వ నమోదులతో ప్రపంచంలోనే రెండవ పెద్ద రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన చైనాలో..మన కృష్ణుని హవా పెరుగుతోంది. కృష్ణుడు చెప్పిన ప్రేమ, భక్తి తత్వాలు వారిని బాగా ఆకట్టుకుంటున్నాయి. గతవారం కృష్ణాష్టమిని చాలా ప్రాంతాల్లో చైనా ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. యోగా సెంటర్లలోనూ, పెద్ద బృందాలుగా ఏర్పడి… ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ సంస్థల నిర్వాహకులు కూడా కొంతమంది ఈ ఉత్సవాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ముఖ్యంగా […]
కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ చైనా… 88.76మిలియన్ల పార్టీ సభ్యత్వ నమోదులతో ప్రపంచంలోనే రెండవ పెద్ద రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన చైనాలో..మన కృష్ణుని హవా పెరుగుతోంది. కృష్ణుడు చెప్పిన ప్రేమ, భక్తి తత్వాలు వారిని బాగా ఆకట్టుకుంటున్నాయి. గతవారం కృష్ణాష్టమిని చాలా ప్రాంతాల్లో చైనా ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. యోగా సెంటర్లలోనూ, పెద్ద బృందాలుగా ఏర్పడి… ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ సంస్థల నిర్వాహకులు కూడా కొంతమంది ఈ ఉత్సవాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ముఖ్యంగా బీజింగ్, షాంఘాయ్ లాంటి నగరాల్లోనే జనం కష్ణ భక్తిలో ఓలలాడటం విశేషం. హరేకృష్ణ అనే నామజపంతో, భక్తిగీతాలు పాడుతూ.. భగవద్గీత వచనాలు చదువుతూ స్వీట్లు పంచుకుంటూ కృష్ణభక్తిలో మునిగితేలారు.
జగన్నాధుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను వాహనాలమీద తిప్పుతూ లడ్డూలు, చపాతీలు, పరమాన్నంలతో పాటు సాంప్రదాయ చైనావంటకాలను సైతం ప్రసాదంగా పంచారు. కమ్యునిస్ట్ దేశంలో దీన్ని మూవ్మెంట్ అని అనలేమని…ఆ పదం అంటే ప్రభుత్వంతో పేచీ వస్తుంది కనుక….అలాంటి ప్రమాదం లేకుండా అనధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భక్తియోగాలో శిక్షణనిస్తున్న దాస్ అనే యోగా గురువు తెలిపారు.
కృష్ణుని ఇష్టపడటం అంటే హిందూ మతాన్ని అనుసరించినట్టు కాదని…. క్రిస్టమస్లాగా కృష్ణుని పుట్టినరోజుని అందరూ జరుపుకోవచ్చని ఆ గురువు చెబుతున్నారు. కృష్ణుని ఆరాధన.. యోగ సాధన తో మొదలవుతున్నదని చైనాలో ఒక మతపరమైన సంస్థని నడుపుతున్న యాంగ్ అన్నారు. ఇందులో ఉన్న మతపరమైన కోణాన్ని జనం చూడటం లేదని ఆయన చెప్పారు. అయితే గత మూడు నాలుగు దశాబ్దాలుగా చైనాలో తిరిగి మతం, ఆధ్యాత్మికతల పట్ల ఆసక్తి పెరగుతున్నదని, ఇక ఎంతోకాలం చైనాని… నాస్తిక చైనా అని అనలేమని ఆయన పేర్కొన్నారు.
Click on Image to Read: