ఆ కేసుతో ఏమీ కాదు...చెడ్డపేరు వారికే
ఓటుకు నోటు అంశాన్ని చంద్రబాబు పార్టీ నేతల వద్ద ప్రస్తావించారు. బుధవారం రాత్రి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు… ఓటుకు నోటు కేసుతో ఏమీ కాదని చెప్పారట. ఈ విషయాన్ని టీడీపీ అనుకూల పత్రిక వెల్లడించింది. ”ఈ కేసులో ఏమీ లేదు, వాళ్ల వల్ల ఏమీ కాదు, పైగా ఇలాంటి కేసుల వల్ల తిరిగి వాళ్లకే చెడ్డపేరు వస్తుంది” అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు పత్రిక ప్రచురించింది. తాను రాష్ట్రం కోసం కష్టపడుతుంటే ప్రతిపక్షాలు కేసులు […]

ఓటుకు నోటు అంశాన్ని చంద్రబాబు పార్టీ నేతల వద్ద ప్రస్తావించారు. బుధవారం రాత్రి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు… ఓటుకు నోటు కేసుతో ఏమీ కాదని చెప్పారట. ఈ విషయాన్ని టీడీపీ అనుకూల పత్రిక వెల్లడించింది. ”ఈ కేసులో ఏమీ లేదు, వాళ్ల వల్ల ఏమీ కాదు, పైగా ఇలాంటి కేసుల వల్ల తిరిగి వాళ్లకే చెడ్డపేరు వస్తుంది” అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు పత్రిక ప్రచురించింది. తాను రాష్ట్రం కోసం కష్టపడుతుంటే ప్రతిపక్షాలు కేసులు వేస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారని పత్రిక చెబుతోంది. ఓటుకు నోటు కేసు ప్రాతిపదికే చెల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఏసీబీ కోర్టుకు వెళ్లడం ఏమిటని బాబు వ్యాఖ్యానించారని సదరు పత్రిక రాసింది. ఒకవేళ చంద్రబాబు చెప్పేదే సమర్థనీయమైతే ఇకపై ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి కొనేందుకు ప్రయత్నించినా తప్పు కాదన్న మాట.
Click on Image to Read: