పక్కా రన్ టైం లాక్ చేసిన జనతా గ్యారేజ్
ఎన్టీఆర్ పాత సినిమాల సంగతి మరిచిపోండి. కొరటాల శివ పాత సినిమాల వైపు ఓసారి చూడండి. శ్రీమంతుడులో ఎక్కడైనా కావాలని కామెడీ ట్రాక్ పెట్టారా… అసలు శ్రీమంతుడు సెకెండాఫ్ లో ఎక్కడైనా కథ పక్కకు వెళ్తుందా… అంతకంటే ముందొచ్చిన మిర్చి సినిమా సెకెండాఫ్ ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి. ఈమధ్య కాలంలో కథపై పక్కా కమాండ్ తో సినిమా తీస్తున్న దర్శకుల్లో కొరటాల శివ కూడా ఒకడు. జనతా గ్యారేజ్ కూడా అలానే తెరకెక్కింది. ఈ సినిమా […]
ఎన్టీఆర్ పాత సినిమాల సంగతి మరిచిపోండి. కొరటాల శివ పాత సినిమాల వైపు ఓసారి చూడండి. శ్రీమంతుడులో ఎక్కడైనా కావాలని కామెడీ ట్రాక్ పెట్టారా… అసలు శ్రీమంతుడు సెకెండాఫ్ లో ఎక్కడైనా కథ పక్కకు వెళ్తుందా… అంతకంటే ముందొచ్చిన మిర్చి సినిమా సెకెండాఫ్ ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి. ఈమధ్య కాలంలో కథపై పక్కా కమాండ్ తో సినిమా తీస్తున్న దర్శకుల్లో కొరటాల శివ కూడా ఒకడు. జనతా గ్యారేజ్ కూడా అలానే తెరకెక్కింది. ఈ సినిమా రన్ టైంను 2 గంటల 28నిమిషాలకు ఫిక్స్ చేశారు. ఈ టైమ్ లో ఎక్కడా కావాలని పెట్టిన సన్నివేశాలు, పాటలు కనిపించవంటున్నాడు దర్శకుడు. అంతా సినిమా కథలో కలిసిపోతుందని, అన్నీ ఎక్కడ, ఎలా ఉండాలో అలానే ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే శ్రీమంతుడు కంటే ఎక్కువగా కథపై ఫోకస్ పెట్టి ఈ సినిమా చేశానని, అందుకే జనతా గ్యారేజ్ లో హీరోయిజం కంటే కథ, అందులోని సీరియస్ నెస్ ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నాడు కొరటాల.
మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా దానికి ట్యూన్ అయిపోయారు. ఎందుకంటే.. గత సినిమా నాన్నకు ప్రేమతో ఎలా ఉందో అందరం చూశాం. కొరటాల స్టయిల్ ఏంటో కూడా తెలుసు. కాబట్టి జనతా గ్యారేజ్ సినిమాను సీరియస్ మోడ్ లోనే చూడాలని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. అలా జనాల మైండ్ సెట్ ఫిక్స్ చేయడంలో యూనిట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది. సినిమాకు ఇది కూడా ఓ కీలకమైన అంశమే.