Telugu Global
Cinema & Entertainment

  మెగాస్టార్ సెట్స్ లో అక్కినేని హీరో...

మెగాస్టార్ సెట్స్ లోకి మెగా హీరోలు రావడం కామన్. రామ్ చరణ్ ఎలాగూ నిర్మాత కాబట్టి వస్తుంటాడు పోతుంటాడు. ఇక బన్నీ, వరుణ్ తేజ, సాయిధరమ్ తేజ లాంటి హీరోలు వచ్చినా అది పెద్ద సెన్సేషన్ మాత్రం కాదు. కానీ మెగా కాంపౌండ్ తో సంబంధం లేని ఓ హీరో ఖైదీ నంబర్-150 సెట్స్ లోకి వచ్చాడు. అతడే అక్కినేని సిసింద్రీ అఖిల్. సడెన్ గా మెగాస్టార్ సెట్స్ లోకి ఎంటరైన అఖిల్ ను చూసి అంతా […]

  మెగాస్టార్ సెట్స్ లో అక్కినేని హీరో...
X

మెగాస్టార్ సెట్స్ లోకి మెగా హీరోలు రావడం కామన్. రామ్ చరణ్ ఎలాగూ నిర్మాత కాబట్టి వస్తుంటాడు పోతుంటాడు. ఇక బన్నీ, వరుణ్ తేజ, సాయిధరమ్ తేజ లాంటి హీరోలు వచ్చినా అది పెద్ద సెన్సేషన్ మాత్రం కాదు. కానీ మెగా కాంపౌండ్ తో సంబంధం లేని ఓ హీరో ఖైదీ నంబర్-150 సెట్స్ లోకి వచ్చాడు. అతడే అక్కినేని సిసింద్రీ అఖిల్. సడెన్ గా మెగాస్టార్ సెట్స్ లోకి ఎంటరైన అఖిల్ ను చూసి అంతా అవాక్కయ్యారు. కనీసం సమాచారం అయినా ఇవ్వకుండా సిసింద్రీ సెట్స్ లోకి వచ్చేశాడు. దీంతో కాసేపు షాక్ అయినప్పటికీ ఆ తర్వాత అంతా ఫుల్ హ్యాపీస్. అయితే మెగాస్టార్ సెట్స్ లోకి అఖిల్ రావడానికి కారణం ఒకటే. ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్న వినాయక్ అంటే అఖిల్ కు ప్రత్యేకమైన గౌరవం. అఖిల్ తొలి సినిమాకు దర్శకత్వం వహించింది వినాయకే కదా. అందుకే ఆ పరిచయం, అనుభవంతో మెగాస్టార్ సెట్స్ లోకి ఎంటరైపోయాడు సిసింద్రీ. దర్శకుడు వీవీ వినాయక్ స్వయంగా అఖిల్ ను రిసీవ్ చేసుకున్నాడు. షాట్ గ్యాప్ లో కాసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరూ కలిసి సరదాగా సెల్ఫీ దిగారు. అయితే ఈ విజిట్ లో మెగాస్టార్ చిరంజీవిని అఖిల్ కలిశాడా లేదా అనేది మాత్రం తేలలేదు. ఒకవేళ కలిసిఉంటే కనుక కచ్చితంగా ఆ సెల్ఫీని కూడా అఖిల్ పోస్ట్ చేసి ఉండేవాడు. కాబట్టి… మెగాస్టార్ ను అఖిల్ కలవలేదనే అనుకోవాలి. బహుశా.. ఆ టైమ్ లో సెట్స్ లో మెగాస్టార్ లేడేమో…

Click to Read….

మ‌హేష్ ను ఎన్టీఆర్ ఓవ‌ర్ టేక్ చేస్తాడా..? మ‌హేష్ ను ఎన్టీఆర్ ఓవ‌ర్ టేక్ చేస్తాడా..?

First Published:  31 Aug 2016 6:56 AM IST
Next Story