ఒలింపిక్స్ లో బంగారు పతకాలు.....ఆవు కథ!
మనం ఎప్పటినుండో ఒక ఆవు కథని వింటున్నాం. ఒక విద్యార్థి స్కూల్లో పరీక్షల కోసం ఆవు వ్యాసాన్ని మాత్రమే చదువుకుని ఉంటాడు. ఇక దేని గురించి అడిగినా…అతను దానికి ఆవుతో లింక్ చేసి…ఆవు గురించి మాత్రమే చెబుతుంటాడు. అంటే తాజ్‌మహల్ గురించి చెప్పమంటే…తాజ్ మహల్ ముందు ఒక ఆవు పడుకుని ఉంది…అని చెప్పి…తిరిగి ఆవు గురించే చెబుతాడు. చార్మినార్ గురించి చెప్పమన్నా…చార్‌మినార్ ముందు ఒక ఆవు ఉంది…అంటూ ఆవు గురించే చెబుతాడు. మనదేశంలో కూడా ఈ మధ్యకాలంలో […]
మనం ఎప్పటినుండో ఒక ఆవు కథని వింటున్నాం. ఒక విద్యార్థి స్కూల్లో పరీక్షల కోసం ఆవు వ్యాసాన్ని మాత్రమే చదువుకుని ఉంటాడు. ఇక దేని గురించి అడిగినా…అతను దానికి ఆవుతో లింక్ చేసి…ఆవు గురించి మాత్రమే చెబుతుంటాడు. అంటే తాజ్‌మహల్ గురించి చెప్పమంటే…తాజ్ మహల్ ముందు ఒక ఆవు పడుకుని ఉంది…అని చెప్పి…తిరిగి ఆవు గురించే చెబుతాడు. చార్మినార్ గురించి చెప్పమన్నా…చార్‌మినార్ ముందు ఒక ఆవు ఉంది…అంటూ ఆవు గురించే చెబుతాడు. మనదేశంలో కూడా ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు…ముఖ్యంగా బిజెపి నేతలు ప్రతివిషయంలోకి ఆవుని చొప్పిస్తున్నారు. ఏదో విధంగా ఆవుని ప్రచారంలోకి తెస్తున్నారు. అలాగే బిజెపి ఎంపి ఉదిత్ రాజ్….ఒలింపిక్స్లో పతకాల సాధనను కూడా ఆవుతో ముడిపెట్టి మాట్లాడారు. యోగా గురువు రామ్ దేవ్ బాబాసైతం ఇదే విధంగా స్పందించారు. అయితే వారిద్దరూ ఆవుపై పరస్పర విరుద్ధంగా మాట్లాడారు..
ఉదిత్ రాజ్…. గొడ్డుమాంసం తింటే ఒలింపిక్ క్రీడల్లో రాణించే అవకాశం ఉందనుకుంటే…అలాగే చేయవచ్చని…మనకు కావాల్సింది గోల్డ్ మెడల్స్ అని…బిజెపి బీఫ్ తినడానికి అడ్డు చెప్పదని అన్నారు. జమైకా అథ్లెట్ ఉసైన్ బోల్ట్ పేదవాడని, ఆయన శిక్షకుడు ఆయనకు బీఫ్ తినమని చెప్పాడని..అలా తిన్నందువల్లనే అతను ఒలింపిక్స్లో తొమ్మిది బంగారు పతకాలు సాధించాడని ఉదిత్రాజ్ చెప్పుకొచ్చారు.
ఆయన మాటలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాక ఎంపిగారు తిరిగి తన మాటలకు క్లారిటీ ఇచ్చుకున్నారు. జమైకా క్రీడాకారులకు వసతులు లేకపోయినా, వాళ్లు పేదవాళ్లయినా …బోల్ట్ బంగారు పతకాలు సాధించాడని, మనవాళ్లు కూడా అలా విజయం సాధించే మార్గాలు వెతకాలని మాత్రమే అన్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. పరిస్థితులను, ప్రభుత్వాలను తిట్టకుండా పతకాలు తెచ్చే మార్గాలను మాత్రమే వెతకాలని క్రీడాకారులకు చెప్పానని ఆయన అన్నారు. అయితే ఆహారం అనేది వ్యక్తుల వ్యక్తిగత ఇష్టానికి సంబంధించినది… అని కూడా ఉదిత్రాజ్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం ఈ వ్యాఖ్యలు చేయగా… రామ్‌దేవ్ బాబా ఈ రోజు దీనిపై స్పందించారు. ఛాంపియన్కి కావాల్సిన శక్తి సామర్ధ్యాలు ఆవు నెయ్యి తినటం వలన వస్తాయి కానీ… మాంసం తినటం వల్ల రావని ఆయన అన్నారు.
Click on Image to Read: