సోగ్గాడే సీక్వెల్ లేనట్టే...
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో భాగస్వామ్యం ఏర్పాటుచేసుకున్న ప్రతి ఒక్కరికి రూపాయికి వంద రూపాయలొచ్చాయి. ఎంత లాభమో ఒక్కసారి ఊహించుకోండి. అంతటి ఘనవిజయాన్ని అందుకున్న ఈ సినిమాకు కచ్చితంగా సీక్వెల్ లేదా ప్రీక్వెల్ తీస్తానని నాగార్జున గతంలో ప్రకటించాడు. ఆ ప్రాజెక్టుకు బంగార్రాజు అనే టైటిల్ కూడా కన్ ఫర్మ్ చేశారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే ఉంటుందని కూడా ప్రకటించారు. […]
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో భాగస్వామ్యం ఏర్పాటుచేసుకున్న ప్రతి ఒక్కరికి రూపాయికి వంద రూపాయలొచ్చాయి. ఎంత లాభమో ఒక్కసారి ఊహించుకోండి. అంతటి ఘనవిజయాన్ని అందుకున్న ఈ సినిమాకు కచ్చితంగా సీక్వెల్ లేదా ప్రీక్వెల్ తీస్తానని నాగార్జున గతంలో ప్రకటించాడు. ఆ ప్రాజెక్టుకు బంగార్రాజు అనే టైటిల్ కూడా కన్ ఫర్మ్ చేశారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే ఉంటుందని కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై అనుమానాలు రెట్టింపు అయ్యాయి.
స్వయంగా నాగార్జున బంగార్రాజు ప్రాజెక్టుపై మాట్లాడాడు. తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించిన నాగార్జున.. బంగార్రాజు ప్రాజెక్టుకు సంబంధించి కథ సెట్ అవ్వలేదని ప్రకటించాడు. సీక్వెల్ అయినా ప్రీక్వెల్ అయినా కథ కొత్తగా ఉండాలని, సీక్వెల్ తీస్తున్నాం కదా అని రొటీన్ కథనే సాగదీస్తే జనాలు చూడరనేది నాగ్ అభిప్రాయం. అందుకే మంచి కథ దొరికే వరకు బంగార్రాజు ప్రాజెక్టు తెరపైకి రాదని తేల్చిచెప్పేశాడు. ఈ గ్యాప్ లో దర్శకుడు కల్యాణ్ కృష్ణ.. నాగచైతన్యతో సినిమాకు రెడీ అవుతున్నాడు.