Telugu Global
Cinema & Entertainment

లెజెండ్ మిల్కా సింగ్  ఒక్క రూపాయి తీసుకుంటే..ధోని మాత్రం  60 కోట్లు చార్జ్  చేశాడు..! 

టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని జీవితంపై త్వరలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ఎంఎస్ ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈచిత్రం కోసం దేశంలోని క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక క్రికెటర్ జీవితంపై సినిమా రావడం… అది అతని రిటైర్మెంటుకు ముందే రిలీజ్ అవ్వడం ఇదే తొలిసారి. ధోని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎక్కడో జార్ఖండ్ రాష్ట్రంలో మామూలు మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఇంత పెద్ద […]

లెజెండ్ మిల్కా సింగ్  ఒక్క రూపాయి తీసుకుంటే..ధోని మాత్రం  60 కోట్లు చార్జ్  చేశాడు..! 
X
టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని జీవితంపై త్వరలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ఎంఎస్ ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈచిత్రం కోసం దేశంలోని క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక క్రికెటర్ జీవితంపై సినిమా రావడం… అది అతని రిటైర్మెంటుకు ముందే రిలీజ్ అవ్వడం ఇదే తొలిసారి. ధోని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎక్కడో జార్ఖండ్ రాష్ట్రంలో మామూలు మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఇంత పెద్ద క్రికెట్ స్టార్ గా ఎదగడం వెనక చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ సినిమాలో చూపించబోతున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీషులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా వేలాది థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా… తన జీవిత కథను సినిమాగా తీసినందుకు ధోనీ రూ. 60 కోట్ల వరకు చార్జ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో ధోనీ చార్జ్ చేయడం చర్చనీయాంశం అయింది. అయితే ఈ మొత్తం ఆయనకు ముందే చెల్లించారా? లేక సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల నుండి ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
అయితే గ‌తంలో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం ప్ర‌కాష్ మోహ్రా డైరెక్ష‌న్ లో వ‌చ్చిన భాగ్ మిల్కా భాగ్ చిత్రం .. లీవింగ్ లెజెండ్ అథ్లేట్ మిల్కాసింగ్ జీవిత చ‌రిత్ర‌. ఆయ‌న జీవిత క‌థ‌ను సినిమా గా చేయాల‌ని ద‌ర్శ‌కుడు మిల్కాను క‌ల‌సి అడిగితే..ఆయ‌న జ‌స్ట్ 1 రూపాయి ఇవ్వండి చాలు అని అన్నార‌ట‌. కానీ అదే త‌ర‌హాలో థోని మాత్రం త‌న జీవిత క‌థను సినిమా గా చేయ‌డానికి 60 కోట్లు చార్జ్ చేశాడ‌ట‌. వాట్ ఎ బిజినెస్ క‌దా.!
First Published:  30 Aug 2016 6:31 AM IST
Next Story