మీ వల్లే నష్టం... నన్ను విమర్శిస్తే పార్టీకే నష్టం!
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వాదనకు భిన్నంగా.. టీఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జానారెడ్డిపై కారాలు మిరియాలు నూరారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో సీఎల్పీ సమావేశంలో పెద్దలు జానారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో జానా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. మీ వ్యాఖ్యలు సొంత పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని, పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయని ధ్వజమెత్తారు. అవగాహన ఒప్పందం కుదిరిందని టీపీసీసీ […]
BY sarvi30 Aug 2016 2:30 AM IST
X
sarvi Updated On: 30 Aug 2016 6:41 AM IST
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వాదనకు భిన్నంగా.. టీఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జానారెడ్డిపై కారాలు మిరియాలు నూరారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో సీఎల్పీ సమావేశంలో పెద్దలు జానారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో జానా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. మీ వ్యాఖ్యలు సొంత పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని, పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయని ధ్వజమెత్తారు. అవగాహన ఒప్పందం కుదిరిందని టీపీసీసీ చీఫ్ చెబుతుంటే.. అలాంటిదేమీ లేదని విలేకరుల సమావేశంలో ఎలా వెల్లడిస్తారంటూ మండిపడ్డారు. నయీం కేసులో ప్రభుత్వాన్ని అభినందించడం, సీబీఐ విచారణ అక్కర్లేదంటూ సర్కారుకు వత్తాసు పలకడం వల్ల జనాల్లో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీటన్నింటినీ సావధానంగా విన్న జానారెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నా వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు వక్రీకరించారని వివరణ ఇచ్చుకున్నారు. ఇకపోతే నయీం ఎన్‌కౌంటర్ విషయంలోనూ ఆయన చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ నన్ను విమర్శిస్తే.. పార్టీకే నష్టమని జానా స్పష్టం చేశారు.
Next Story