ఓటుకు నోటు కేసుపై స్పందించిన చంద్రబాబు
ఓటుకు నోటు కేసుపై పునర్‌విచారణకు ఏసీబీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కరువుపై మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు వద్ద విలేకర్లు ఓటుకు నోటు కేసు అంశాన్ని ప్రస్తావించారు. దీంతో చంద్రబాబు ఆచితూచి స్పందించారు. పొడిపొడి మాటలతో సరిపెట్టారు.” ఏముంది దాంట్లో?. ఈ కేసులో నేనేం మాట్లాడాలి?. కేసులో ఏముందో తెలుసా?. ఒకసారి మీరే స్టడీ చేసి చెప్పండి… ఆ కేసులో ఏముందో. అయినా ఏమైనా ఉంటే మా లాయర్లు చూసుకుంటారు” అని చంద్రబాబు […]
ఓటుకు నోటు కేసుపై పునర్‌విచారణకు ఏసీబీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కరువుపై మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు వద్ద విలేకర్లు ఓటుకు నోటు కేసు అంశాన్ని ప్రస్తావించారు. దీంతో చంద్రబాబు ఆచితూచి స్పందించారు. పొడిపొడి మాటలతో సరిపెట్టారు.” ఏముంది దాంట్లో?. ఈ కేసులో నేనేం మాట్లాడాలి?. కేసులో ఏముందో తెలుసా?. ఒకసారి మీరే స్టడీ చేసి చెప్పండి… ఆ కేసులో ఏముందో. అయినా ఏమైనా ఉంటే మా లాయర్లు చూసుకుంటారు” అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు.
మరోవైపు కరువుపై యుద్ధం ప్రకటించామని సీఎం చెప్పారు. రెయిన్ గన్స్ ఆపరేట్ చేసేందుకు కాలేజ్ విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మొన్నటి వరకు 4.95 లక్షల ఎకరాలు ఉంటే… ఇప్పటి వరకు రెండు లక్షల ఎకరాలను రెయిన్ గన్స్‌తో కాపాడామన్నారు. వర్షం కారణంగా మరో లక్ష ఎకరాల పంటకు మంచి జరిగిందన్నారు. మిగిలిన లక్షా 30 వేల ఎకరాలను బుధవారం సాయంత్రానికి కాపాడుతామన్నారు. అయితే చంద్రబాబు ప్రకటనపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరువుబారిన పడిన పంట మొత్తం కాపాడామని ప్రకటించడం ద్వారా నష్టపరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు.
Click on Image to Read: