ఓటుకు నోటులో మళ్లీ పావులు కదుపుతున్న చంద్రబాబు
ఓటుకు నోటు కేసును పునర్ విచారించి చంద్రబాబు పాత్రను తేల్చాలంటూ ఏసీబీ కోర్టు ఆదేశించడంతో మళ్లీ టీడీపీలో కలకలం రేగుతోంది. మెజారిటీ మీడియా చేతుల్లో ఉండడంతో దీని తీవ్రత జనంలోకి వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నప్పటికీ పునర్ విచారణ జరిగితే భారీ నష్టం తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు వాయిసేనని ఫోరెన్సిక్ రిపోర్టు తేల్చడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకున్నా చంద్రబాబు పేరును నిందితుల జాబితాలో చేర్చాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. పైగా 32చోట్ల చార్జీషీట్‌లో […]
ఓటుకు నోటు కేసును పునర్ విచారించి చంద్రబాబు పాత్రను తేల్చాలంటూ ఏసీబీ కోర్టు ఆదేశించడంతో మళ్లీ టీడీపీలో కలకలం రేగుతోంది. మెజారిటీ మీడియా చేతుల్లో ఉండడంతో దీని తీవ్రత జనంలోకి వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నప్పటికీ పునర్ విచారణ జరిగితే భారీ నష్టం తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు వాయిసేనని ఫోరెన్సిక్ రిపోర్టు తేల్చడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకున్నా చంద్రబాబు పేరును నిందితుల జాబితాలో చేర్చాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. పైగా 32చోట్ల చార్జీషీట్‌లో చంద్రబాబు పేరు కూడా ఇప్పటికే ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఏసీబీ అధికారులు కూడా కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై సమావేశమయ్యారు. ఇదే సమయంలో చంద్రబాబు తెర వెనుక చక్రం తిప్పుతున్నారని టీవీ ఛానల్లో వార్తలొస్తున్నాయి. కేసులో నిందితులుగా ఉన్న వారిని అజ్ఞాతంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారని కథనాల సారాంశం. వచ్చే నెల 29లోగా కేసు విచారణ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించినందున … టీ ఏసీబీ సీరియస్‌గానే పనిచేసే అవకాశం ఉంటుందన్న భావనతో తొలుత నిందితులను అజ్ఞాతంలోకి పంపించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.
సోమవారం కోర్టు నిర్ణయం వెలువడగానే చంద్రబాబు హుటాహుటీన తిరుపతి పర్యటన రద్దు చేసుకుని విజయవాడ వచ్చారు. న్యాయనిపుణులతోనూ చర్చించారు. పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైందని టీడీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఫోరెన్సిక్ నివేదికలో ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు వాయిసేనని తేలినందన… అందుకు విరుద్దంగా తెలంగాణ ఏసీబీ కోర్టుకు చార్జీషీట్ ఇచ్చే అవకాశం ఉండదంటున్నారు. ఒకవేళ అదే జరిగితే చంద్రబాబుతో కుమ్మక్కు అయ్యారన్న అపవాదు కేసీఆర్‌పై పడే అవకాశం ఉంటుందంటున్నారు. కాబట్టి ఏసీబీ విచారణలో కేసీఆర్ వేలు పెట్టే అవకాశం ఉండదంటున్నారు. ఒకవేళ చంద్రబాబు పైకోర్టుకు వెళ్తే… ప్రతి కేసులోనూ చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటారన్న భావనకు మరింత బలం చేకూర్చినట్టు అవుతుందంటున్నారు. కొద్ది రోజులు గడిస్తే పరిస్థితి ఏమిటన్నదానిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
Click on Image to Read: