సమస్యలున్నప్పుడే గుర్తొచ్చి వీర్రవీగుతున్నారు " రైతులపై బాబు ఫైర్
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజవకర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… అక్కడి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వాతావరణ పంటల బీమా చేయించుకోలేదంటూ రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత పంటలకు బీమా చేయించుకున్నారా అని రైతులకు చంద్రబాబు ప్రశ్నించారు. రైతులు తమకు తెలియదని, చేయించుకోలేదని మూకుమ్మడిగా చెప్పారు. దీంతోచంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అధికార యంత్రాంగాన్ని మీ వద్దకే పంపినా ఎందుకు బీమా చేయించుకోలేదని ప్రశ్నించారు. మీలోమార్పు రావాలి. కష్టమొచ్చిందని ప్రభుత్వంపై చిందులేస్తారా..? అంతా బాగుంటే మేం గుర్తుకురాం, ఇబ్బందులొస్తే […]

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజవకర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… అక్కడి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వాతావరణ పంటల బీమా చేయించుకోలేదంటూ రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత పంటలకు బీమా చేయించుకున్నారా అని రైతులకు చంద్రబాబు ప్రశ్నించారు. రైతులు తమకు తెలియదని, చేయించుకోలేదని మూకుమ్మడిగా చెప్పారు. దీంతోచంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అధికార యంత్రాంగాన్ని మీ వద్దకే పంపినా ఎందుకు బీమా చేయించుకోలేదని ప్రశ్నించారు. మీలోమార్పు రావాలి. కష్టమొచ్చిందని ప్రభుత్వంపై చిందులేస్తారా..? అంతా బాగుంటే మేం గుర్తుకురాం, ఇబ్బందులొస్తే గుర్తొస్తామా?. సమస్యలు ఉన్నప్పుడే మేం (ప్రభుత్వం) గుర్తొచ్చి ఇలా విర్రవీగుతారని రైతులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రైతులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించవద్దని సూచించారు. వేరే అలవాట్ల వల్లే రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు చెప్పారు. ఇందుకు తానేమీ చేయలేనన్నారు.
Click on Image to Read: