14 ఏళ్ల రేప్ బాధితురాలు...అబార్షన్ అయిన పిండంతో పోలీస్ స్టేషన్‌కి వచ్చింది!
దోపిడి దొంగలు తల్లీ కూతుళ్లను అత్యాచారం చేసిన ఘటన తరువాత ఉత్తర ప్రదేశ్, బులంద్ షహర్ ని ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. ఈ ఊరు… నేరాలు ఘారాలతో తరువాత కూడా తరచుగా వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. ఇప్పుడు ఇదే ఊళ్లో మరో దారుణం చోటు చేసుకుంది. ఆరునెలలుగా అత్యాచారానికి గురయిన ఓ 14ఏళ్ల బాలిక…గర్భం దాల్చింది. అయితే అత్యాచారం చేసినవాడే ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించడంతో ఆ బాలిక అబార్షన్ అయిన పిండాన్ని పాలిథిన్ బ్యాగులో వేసుకుని పోలీస్ […]
దోపిడి దొంగలు తల్లీ కూతుళ్లను అత్యాచారం చేసిన ఘటన తరువాత ఉత్తర ప్రదేశ్, బులంద్ షహర్ ని ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. ఈ ఊరు… నేరాలు ఘారాలతో తరువాత కూడా తరచుగా వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. ఇప్పుడు ఇదే ఊళ్లో మరో దారుణం చోటు చేసుకుంది. ఆరునెలలుగా అత్యాచారానికి గురయిన ఓ 14ఏళ్ల బాలిక…గర్భం దాల్చింది. అయితే అత్యాచారం చేసినవాడే ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించడంతో ఆ బాలిక అబార్షన్ అయిన పిండాన్ని పాలిథిన్ బ్యాగులో వేసుకుని పోలీస్ స్టేషన్‌కి వచ్చింది. బాలిక చేసిన ఈ పనికి పోలీసులు ఖంగుతిన్నారు. కానీ పాపం… ఆ అమ్మాయి ఆ రుజువుతోనైనా తనకు విముక్తి కలుగుతుందని ఆశపడి ఉండవచ్చు.
నిందితుడు యూనస్ అహ్మద్ బులంద్ షహర్‌లోని భాయిపురా గ్రామంలో బాలిక ఇంటి పక్కనే ఉంటున్నాడు. అతను బాలికని బెదిరించి ఆరునెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయింది. ఈ నెల 28న బాలిక గర్భవతి అన్న సంగతి ఆమె ఇంట్లో వారికి తెలిసింది. దాంతో ఆమె తల్లి అన్నవెళ్లి నిందితుని ఇంట్లో గొడవ పెట్టుకున్నారు. ఈ పరిణామం తరువాత నిందితుడు బాలికను మంత్రసాని వద్దకు తీసుకువెళ్లి బలవంతంగా అబార్షన్ చేయించాడు. బాలిక ఆ పిండాన్ని పాలిథిన్ బ్యాగ్‌లో వేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నిందితునిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.