బాయ్స్ కు 13 ఏళ్లు...
వచ్చిన కొత్తలో బూతు సినిమా అన్నారు. డబ్బాలో రాళ్లు వేసి ఆడించినట్టు ఉందని రెహ్మాన్ మ్యూజిక్ ను ఎద్దేవా చేశారు. శంకర్ కు పిచ్చిపట్టిందని కామెంట్ చేశారు. అనవసరంగా డబ్బు వృధా చేశారని మరికొందరు ఆరోపించారు. బాయ్స్ సినిమా విడుదలైన కొత్తలో ఇలా ఎన్నో విమర్శలు. కానీ శంకర్ నమ్మకం వృధా పోలేదు. ఎవర్ని టార్గెట్ చేశాడో వాళ్లే బ్రహ్మరథం పట్టారు. బాయ్స్ సినిమాకు సౌత్ లోని బాయ్స్ అంతా పూర్తి మద్దతు తెలిపారు. సినిమాలో ప్రతి […]
BY sarvi30 Aug 2016 4:37 AM IST
X
sarvi Updated On: 30 Aug 2016 12:34 PM IST
వచ్చిన కొత్తలో బూతు సినిమా అన్నారు. డబ్బాలో రాళ్లు వేసి ఆడించినట్టు ఉందని రెహ్మాన్ మ్యూజిక్ ను ఎద్దేవా చేశారు. శంకర్ కు పిచ్చిపట్టిందని కామెంట్ చేశారు. అనవసరంగా డబ్బు వృధా చేశారని మరికొందరు ఆరోపించారు. బాయ్స్ సినిమా విడుదలైన కొత్తలో ఇలా ఎన్నో విమర్శలు. కానీ శంకర్ నమ్మకం వృధా పోలేదు. ఎవర్ని టార్గెట్ చేశాడో వాళ్లే బ్రహ్మరథం పట్టారు. బాయ్స్ సినిమాకు సౌత్ లోని బాయ్స్ అంతా పూర్తి మద్దతు తెలిపారు. సినిమాలో ప్రతి క్యారెక్టర్ లో తమనుతాము చూసుకున్నారు. దీంతో ఫ్లాప్ టాక్ తో ప్రారంభమైన బాయ్స్ సినిమా వారం తిరిగే సరికి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లలో కొత్త లెక్కలు చూపించింది. శంకర్ ఇలాంటి సినిమాలు కూడా చేస్తాడా అని అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది.
ఈ సినిమాతోనే హీరో సిద్దార్థ్ వెండితెరకు పరిచయం అయ్యాడు. అప్పటివరకు అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్న సిద్ధూ హీరోగా అయిపోయాడు. అంతేకాదు.. బొమ్మరిల్లులో హ..హ..హాసినిగా మెప్పించిన జెనీలియాకు కూడా ఫస్ట్ మూవీ ఇదే. ప్రస్తుతం టాలీవుడ్ ను తన కిర్రాక్ మ్యూజిక్ తో ఊపేస్తున్న తమన్ ఇందులో ఓ క్యారెక్టర్ చేశాడు. అంతేకాకుండా టైం-ఫ్రీజ్ టెక్నిక్ తో తెరకెక్కించిన మొదటి ఇండియన్ మూవీగా కూడా ఇది పేరుతెచ్చుకుంది. సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ 62 కెమెరాలు ఉపయోగించి ఈ టెక్నాలజీ సహాయంతో ఓ పాటను తెరకెక్కించాడు. సినిమాలో అలె..అలె పాట మొత్తం ఈ టెక్నాలజీ మీదే నడుస్తోంది. ఇలా బాయ్స్ సినిమాలో ఎన్నో హంగులున్నాయి.
Next Story