Telugu Global
NEWS

నారాయణపై ఉండవల్లి సంచలన ఆరోపణలు

రామోజీరావును చిట్‌ఫండ్ స్కాంను షేక్ చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్‌ ఇప్పుడు మంత్రి నారాయణకు సంబంధించిన అంశాలను బయటపెట్టారు. రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన…నారాయణ సొసైటీకి చెందిన రూ. 474 కోట్లను మంత్రినారాయణ తన సొంత ఖాతాలోకి మార్చిన అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. సొసైటీ పేరు మీద వేల కోట్లు ఉన్నా వాటిలో ఒక్క రూపాయి కూడా సొంత ఖాతాల్లోకి మళ్లించేందుకు నిబంధనలు ఒప్పుకోవన్నారు. కానీ నారాయణ మాత్రం రూ. 474 కోట్లను సొంత ఖాతాలోకి మళ్లించేసుకున్నారని […]

నారాయణపై ఉండవల్లి సంచలన ఆరోపణలు
X

రామోజీరావును చిట్‌ఫండ్ స్కాంను షేక్ చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్‌ ఇప్పుడు మంత్రి నారాయణకు సంబంధించిన అంశాలను బయటపెట్టారు. రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన…నారాయణ సొసైటీకి చెందిన రూ. 474 కోట్లను మంత్రినారాయణ తన సొంత ఖాతాలోకి మార్చిన అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. సొసైటీ పేరు మీద వేల కోట్లు ఉన్నా వాటిలో ఒక్క రూపాయి కూడా సొంత ఖాతాల్లోకి మళ్లించేందుకు నిబంధనలు ఒప్పుకోవన్నారు. కానీ నారాయణ మాత్రం రూ. 474 కోట్లను సొంత ఖాతాలోకి మళ్లించేసుకున్నారని డాక్యుమెంట్లు చూపారు. ఆ రూ. 474 కోట్లు నారాయణ సొసైటీకి సంబంధించిన సొమ్మా? కాదా? అన్నది నారాయణ చెప్పాలన్నారు. సొసైటీ సొమ్ము కాకుండా ఇప్పటికిప్పుడు 474కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. ఇది చాలా తీవ్రమైన నేరం కాబట్టి 10-15 రోజుల్లో నారాయణ సమాధానం చెప్పకపోతే తాను ఏం చేయాలో అదే చేస్తానని హెచ్చరించారు.

ప్రపంచంలోనే అవినీతి సొమ్మును దాచుకునేందుకు అనువైన దేశంగా సింగపూర్ పేరు సంపాదించిందన్నారు. సొసైటీ పేరుతో కాలేజీలు నడుపుతున్న నారాయణ ఒక్క రూపాయ కూడా పన్ను చెల్లించడం లేదని ఉండవల్లి చెప్పారు. సొసైటీ పేరుతో నడుస్తున్న కాలేజీలు లాభాపేక్ష లేకుండా పనిచేయాల్సి ఉంటుందన్నారు. అమరావతి స్కాంకు అసలు సూత్రధారి నారాయణేనన్నారు. మొత్తం మీద రూ. 474కోట్లు సొంత ఖాతాలోకి ఎలా వచ్చాయో నారాయణ బయటకు చెబుతారో లేదో చూడాలి. చెప్పని పక్షంలో ఉండవల్లి ఏం చేస్తారో!.

Click on Image to Read:

nimmagadda prasad daughter swathi marriage

vote for note case chandrababu naidu

chandrababu naidu rains

chandrababu naidu alzheimer disease

times of india article

jc diwakar reddy

ysrcp

chandrababu pawan

bonda uma kesineni nani

pawan1

ys jagan dharna

koti womens college rabindranath tagore

brahmini

Sudharani Boyapati

First Published:  29 Aug 2016 8:47 AM IST
Next Story