నిద్రపోతున్న గర్భిణిని చంపేసింది...బండి నడుపుతున్న యువకుడిపై దాడిచేసింది!
ఆదమరచి నిద్రపోతున్న గర్భిణిపై ఏనుగు దాడి చేసి చంపేసిన విషాద ఘటన కర్ణాటక, చిత్రదుర్గ జిల్లాలోని బెలఘట్టా గ్రామంలో చోటుచేసుకుంది. తిమ్మక్క (30) అనే ఏడు నెలల గర్భిణి ఆదివారం తెల్లవారు జామున తమ పొలంలో నిద్రపోతుండగా ఏనుగు అక్కడికివచ్చి ఆమెపై దాడి చేసింది. అలాగే బండి మీద వెళుతున్న మొహమ్మద్ అనే యువకుని అటకాయించి అతడిని తీవ్రంగా గాయపరచింది. ఈ ఘటనలో ఏనుగు బైక్ని తుక్కుతుక్కు చేసింది. తిమ్మక్క మరణించగా, మొహమ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. […]

ఆదమరచి నిద్రపోతున్న గర్భిణిపై ఏనుగు దాడి చేసి చంపేసిన విషాద ఘటన కర్ణాటక, చిత్రదుర్గ జిల్లాలోని బెలఘట్టా గ్రామంలో చోటుచేసుకుంది. తిమ్మక్క (30) అనే ఏడు నెలల గర్భిణి ఆదివారం తెల్లవారు జామున తమ పొలంలో నిద్రపోతుండగా ఏనుగు అక్కడికివచ్చి ఆమెపై దాడి చేసింది. అలాగే బండి మీద వెళుతున్న మొహమ్మద్ అనే యువకుని అటకాయించి అతడిని తీవ్రంగా గాయపరచింది. ఈ ఘటనలో ఏనుగు బైక్ని తుక్కుతుక్కు చేసింది. తిమ్మక్క మరణించగా, మొహమ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఏనుగు అంతకుముందు… రాత్రంతా పంటలను నాశనం చేసినట్టుగా గ్రామస్తులు గుర్తించారు. అటవీశాఖ అధికారులు, పోలీసులు బృందాలుగా ఏర్పడి దాన్ని తిరిగి అడవిలోకి పంపేందుకు చర్యలు తీసుకున్నారు. ఆదివారం సాయంత్రానికి కానీ వారు అనుకున్నది చేయలేకపోయారు. తిమ్మక్క కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే, డిప్యుటీ కమిషనర్ యాభైవేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి ఐదులక్షల నష్టపరిహారం అందిస్తుందని వారు తెలిపారు.