రాత్రులు పొట్టిబట్టలు వేసుకోకండి...విదేశీ మహిళల రక్షణకు మంత్రిగారి సలహా!
ఈ మధ్యకాలంలో మనదేశంలో టూరిస్టులుగా వచ్చిన విదేశీ మహిళలపై అత్యాచారాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఇతరదేశాలనుండి మనదేశానికి వచ్చినవారిని సురక్షితంగా… భద్రంగా వారి దేశాలకు పంపటం మన బాధ్యత. అందులో భాగంగా ఇక్కడ తీసుకోవాల్సిన రక్షణ చర్యలను గురించి మాట్లాడకుండా కేంద్ర టూరిజం మంత్రి… వారు వేసుకుంటున్న దుస్తులపై కామెంట్ చేశారు. టూరిజం శాఖా మంత్రి మహేశ్ శర్మ ఆగ్రాలో విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ…విదేశీ మహిళలు ఆగ్రాలో… రాత్రులు పొట్టిబట్టలు ధరించవద్దని, రాత్రులు ఒంటరిగా తిరగవద్దని […]
ఈ మధ్యకాలంలో మనదేశంలో టూరిస్టులుగా వచ్చిన విదేశీ మహిళలపై అత్యాచారాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఇతరదేశాలనుండి మనదేశానికి వచ్చినవారిని సురక్షితంగా… భద్రంగా వారి దేశాలకు పంపటం మన బాధ్యత. అందులో భాగంగా ఇక్కడ తీసుకోవాల్సిన రక్షణ చర్యలను గురించి మాట్లాడకుండా కేంద్ర టూరిజం మంత్రి… వారు వేసుకుంటున్న దుస్తులపై కామెంట్ చేశారు. టూరిజం శాఖా మంత్రి మహేశ్ శర్మ ఆగ్రాలో విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ…విదేశీ మహిళలు ఆగ్రాలో… రాత్రులు పొట్టిబట్టలు ధరించవద్దని, రాత్రులు ఒంటరిగా తిరగవద్దని సలహా ఇచ్చారు.
వారి క్షేమం కోసమే తానీ సూచన చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. మన సంస్కృతి వారి సంస్కృతికి భిన్నంగా ఉంటుందని, అందుకే వారికి ఈ సలహా ఇస్తున్నానని ఆయన అన్నారు. అలాగని పాశ్చాత్య సంస్కృతిని తప్పుపట్టడం లేదని, రెండింటి మధ్య ఉన్న తేడాలను గురించి మాత్రమే చెబుతున్నానన్నారు. విదేశీ టూరిస్టులు తాము ప్రయాణం చేస్తున్న ఆటోలు, క్యాబ్‌ల ఫొటోలను తీసి పెట్టుకోవాలని, ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఆధారాలుగా పనికొస్తాయని మంత్రి సలహా ఇచ్చారు. మొత్తానికి మంత్రిగారు మనం కల్పించాల్సిన రక్షణ గురించి మాట్లాడకుండా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి సెలవిచ్చారు.
Click on Image to Read: