పరిశ్రమకొచ్చి 42 ఏళ్లు....
నందమూరి నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీకొచ్చి సరిగ్గా ఈరోజుకు 42 ఏళ్లు అయ్యాయి. 1974లో సరిగ్గా ఇదే రోజున.. అంటే ఆగస్ట్ 29న బాలయ్య ముఖానికి రంగేసుకున్నారు. నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు నటించిన తాతమ్మ కల చిత్రంలో బుజ్డి బాలయ్య నటించారు. అప్పుడు బాలకృష్ణ వయసు 14 సంవత్సరాలు. అప్పట్నుంచి గ్యాప్ లేకుండా ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉన్నారు. తండ్రి సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేస్తూనే, నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. కొంత వయసు వచ్చిన తర్వాత… 24 […]
BY sarvi29 Aug 2016 9:01 AM IST

X
sarvi Updated On: 29 Aug 2016 10:07 AM IST
నందమూరి నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీకొచ్చి సరిగ్గా ఈరోజుకు 42 ఏళ్లు అయ్యాయి. 1974లో సరిగ్గా ఇదే రోజున.. అంటే ఆగస్ట్ 29న బాలయ్య ముఖానికి రంగేసుకున్నారు. నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు నటించిన తాతమ్మ కల చిత్రంలో బుజ్డి బాలయ్య నటించారు. అప్పుడు బాలకృష్ణ వయసు 14 సంవత్సరాలు. అప్పట్నుంచి గ్యాప్ లేకుండా ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉన్నారు. తండ్రి సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేస్తూనే, నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. కొంత వయసు వచ్చిన తర్వాత… 24 విభాగాలపై పట్టు సాధించారు. అలా తిరుగులేని కథానాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైనా బాలయ్య… కుర్రహీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. 42 ఏళ్ల సినీప్రస్థానంలో ప్రస్తుతం బాలయ్య తన వందో సినిమాను పూర్తిచేస్తున్నారు. ఈ లెజెండ్ మరిన్ని సినిమాలు చేయాలని మనసారా కోరుకుందాం.
Next Story