సీమ కోసం జగన్ భారీ ధర్నా
జగన్ మరో ధర్నాకు సిద్ధమయ్యారు. ఈసారి రాయలసీమ సాగు నీటి కోసం ఉద్యమిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 3న కడప లో భారీగా ధర్నా నిర్వహిస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది. ఈ ధర్నాలో వైఎస్ జగన్ స్వయంగా పాల్గొంటారని వెల్లడించింది. రాయలసీమకు సాగునీరు అందించే విషయంలో చంద్రబాబు పక్షపాత వైఖరిని ధర్నాలో ఎండగడుతారని చెబుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు నీళ్లు విడుదలచేయాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ వద్ద ఈనెల 29న చేయాలని ధర్నా చేయాలని తొలుత […]
జగన్ మరో ధర్నాకు సిద్ధమయ్యారు. ఈసారి రాయలసీమ సాగు నీటి కోసం ఉద్యమిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 3న కడప లో భారీగా ధర్నా నిర్వహిస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది. ఈ ధర్నాలో వైఎస్ జగన్ స్వయంగా పాల్గొంటారని వెల్లడించింది. రాయలసీమకు సాగునీరు అందించే విషయంలో చంద్రబాబు పక్షపాత వైఖరిని ధర్నాలో ఎండగడుతారని చెబుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు నీళ్లు విడుదలచేయాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ వద్ద ఈనెల 29న చేయాలని ధర్నా చేయాలని తొలుత నిర్ణయించారు. కానీ మహా ధర్నాను సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేసినట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకెపాటి అమరనాథరెడ్డి చెప్పారు.
టీడీపీని ఎందుకు నిలదీయడం లేదు- సి.రామచంద్రయ్య
తిరుపతి సభలో కాంగ్రెస్‌పై పవన్ కల్యాణ్ విమర్శలు చేయడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య తప్పుపట్టారు. గతాన్ని తెలుసుకుని పవన్ మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. తిరుపతిసభలో టీడీపీని పవన్ ఎందుకు విమర్శించలేదని సీ. రామచంద్రయ్య ప్రశ్నించారు. హోదా అంశాన్ని జనంలోకి తీసుకెళ్లింది కాంగ్రెస్సేనన్నారు.
Click on Image to Read: