జానాపై డిగ్గీకి ఫిర్యాదు!
కాంగ్రెస్ సీనియర్ నేత.. జానారెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మరోసారి మండిపడ్డారు. తమ్మిడి హెట్టి ప్రాజెక్టు ఎత్తు 152 మీటర్లకు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోలేదని మీడియా ముందు వెల్లడించి పార్టీకి ప్రజల్లో మొహం చెల్లకుండా చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి గుట్టును బయటవేసి పార్టీకి నష్టం కలిగించిన ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని సీనియర్లంతా నిర్ణయించుకున్నారని తెలిసింది. ఈ విషయంలో మాజీ ఎంపీ. హనుమంతరావు […]
BY sarvi27 Aug 2016 9:00 PM GMT
X
sarvi Updated On: 28 Aug 2016 1:47 AM GMT
కాంగ్రెస్ సీనియర్ నేత.. జానారెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మరోసారి మండిపడ్డారు. తమ్మిడి హెట్టి ప్రాజెక్టు ఎత్తు 152 మీటర్లకు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోలేదని మీడియా ముందు వెల్లడించి పార్టీకి ప్రజల్లో మొహం చెల్లకుండా చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి గుట్టును బయటవేసి పార్టీకి నష్టం కలిగించిన ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని సీనియర్లంతా నిర్ణయించుకున్నారని తెలిసింది. ఈ విషయంలో మాజీ ఎంపీ. హనుమంతరావు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
జానారెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ చాలాకాలం నుంచి ప్రచారం ఉంది. వీటిని జానారెడ్డి ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. తనంటే గిట్టని సొంత పార్టీ నాయకులే ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని పలుమార్లు వివరణ ఇచ్చుకున్నారు. కానీ, తమ్మిడిహెట్టి విషయంలో సీఎంను విమర్శించే క్రమంలో తమ పార్టీ అస్సలు ఒప్పందమే చేసుకోలేదనే విషయాన్ని ఎందుకు వెల్లడించాల్సి వచ్చిందని ఆయనకు అనుకూలంగా ఉండేవారు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ బేరిజు వేసుకుంటున్న సీనియర్లు ఆయన రేపో మాపో కారెక్కుతారన్న నిర్ణయానికి వచ్చేశారు.
జానారెడ్డిపై అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే..?
1. నయీంను ఎన్‌కౌంటర్ చేసిన ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ కేసులో సీబీఐ విచారణ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయగా, అవసరం లేదని జానా తేల్చేశారు.
2. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు గైర్హాజరు కావడం.
3. గ్రేటర్ ఎన్నికల ముందు రూ.5 భోజన పథకం బాగుందని ప్రభుత్వానికి కితాబు.
4. రాజ్యసభ ఎన్నికల ముందు ఆయన పార్టీ మారతారంటూ పలుమార్లు వార్తలు వినిపించాయి.
Next Story