టార్గెట్ వైసీపీ!... బలాదూర్ తిరిగి భోజనం వేళకు వచ్చినట్టు...
తిరుపతి మీటింగ్ పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని జాగ్రత్తగా పరిశీలించిన విశ్లేషకులు పలు అభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. ఎంచుకున్న సబ్జెట్, చంద్రబాబును పెద్దగా విమర్శించని తీరు చూసి పవన్ అసలు ఉద్దేశంపై ఒక అంచనాకు వస్తున్నారు. పవన్ టార్గెట్ వైసీపీయేనని భావిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం గడిచిన రెండున్నరేళ్లుగా వైసీపీ గట్టిగానే పోరాటం చేస్తోంది. జగన్ పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు, యువభేరీలు నిర్వహించారు. దీని ద్వారా విద్యార్థులు, సాధారణ జనానికి కూడా ప్రత్యేక హోదా కావాలన్న భావన […]
తిరుపతి మీటింగ్ పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని జాగ్రత్తగా పరిశీలించిన విశ్లేషకులు పలు అభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. ఎంచుకున్న సబ్జెట్, చంద్రబాబును పెద్దగా విమర్శించని తీరు చూసి పవన్ అసలు ఉద్దేశంపై ఒక అంచనాకు వస్తున్నారు. పవన్ టార్గెట్ వైసీపీయేనని భావిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం గడిచిన రెండున్నరేళ్లుగా వైసీపీ గట్టిగానే పోరాటం చేస్తోంది. జగన్ పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు, యువభేరీలు నిర్వహించారు. దీని ద్వారా విద్యార్థులు, సాధారణ జనానికి కూడా ప్రత్యేక హోదా కావాలన్న భావన కలిగించగలిగారు. హోదా విషయంలో మాత్రం టీడీపీ వెనుక్కు రాలేక, ముందుకు వెళ్లలేక ఇబ్బంది పడుతోంది. ఈ సమయంలో తిరుపతిలో సభ పెట్టిన పవన్ కల్యాణ్… రాష్ట్రంలో అవినీతి, అమరావతి నిర్మాణంలో లొసుగులు వీటన్నంటిని పక్కన పెట్టారు, చంద్రబాబును పెద్దగా విమర్శించలేదు. కానీ హోదా కోసం మూడంచెల్లో పోరాటం చేస్తానని చెప్పారు.
మొదటి దశలో మీటింగ్‌లు పెట్టి హోదా అవసరాన్ని ప్రజలకు వివరిస్తానని చెప్పారు. కానీ ప్రత్యేక హోదా గురించి వివరించాల్సిన సమయం దాటి చాలా కాలమైపోయింది. పైగా ప్రతిపక్షాలు ఈ విషయంలో ఇప్పటికే ప్రజలకు బాగానే అవగాహన కలిగించాయి. ఈ సమయంలో ”పవన్ వచ్చారు మళ్లీ మొదలెట్టండి” అన్నట్టుగా జీరో నుంచి ఉద్యమం చేయడం ఏమిటి?. ఇప్పటికే సగం పుణ్యకాలం గడిచిపోయింది. ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయంలో మూడు అంచల పోరాటామా?. మొదటి రెండు అంచెలు పూర్తయి మూడో అంచెకు చేరే సమయానికి 2019 ఎన్నికలు వస్తాయి కాబోలు. పవన్ కోరుకుంటున్నది కూడా అదే అనిపిస్తోంది. హోదాపై మూడంచెల పోరు పేరుతో కాలాన్ని మెల్లగా వెల్లబుచ్చుతూ ఎన్నికల సమయంలో జనాన్ని రెచ్చగొట్టి 2019 ఎన్నికల్లో లబ్ది పొందవచ్చని భావిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ప్రత్యేక హోదా అంశం వైసీపీకి గట్టి అస్త్రంగా తయారైంది. ఆ విషయంలో క్రెడిట్ అంతా వైసీపీకి వెళ్తోందన్న భావన ఉంది. కాబట్టి ఇందుకు విరుగుడుగానే పవన్‌ను కొందరు పెద్దలు వెనుక నుంచి ప్రోత్సహించారా అన్న భావన కలుగుతోంది. ఈ రెండున్నర ఏళ్లలో అపోజిషన్ పార్టీలు చేసిన పోరాటం వల్ల గానీ, మరే ఇతర కారణాల వల్ల గానీ కేంద్రం దిగి వస్తే అప్పుడు క్రెడిట్ మాత్రం జనసేనకే దక్కేలా చేసే వ్యూహరచన కూడా కనిపిస్తోంది. అంటే పగలంతా బలాదూర్ తిరిగేసి.. తీరా అన్నం తినే వేళకు వచ్చి ముందు వరుసలో కూర్చున్నట్టుగా అన్న మాట.
బీజేపీ, కాంగ్రెస్ నేతలను సిగ్గులేదా అని తిట్టిన పవన్… చంద్రబాబు ప్రస్తావన వచ్చే సరికి మాత్రం సీఎం అంటే నాకు గౌరవం ఉంది, నేను చెప్పిన వాటిని సూచనలుగా తీసుకోవాలంటూ మెత్తగా మాట్లాడడం చూస్తుంటే వారి బంధం ఇంకా కొనసాగుతున్నట్టుగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదని తొలుత అన్న వ్యక్తి చంద్రబాబే. కానీ పవన్ మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. మొత్తం మీద పవన్ తీరు చూస్తుంటే ప్రత్యేక హోదా అంశంలో క్రెడిట్ వైసీపీకి వెళ్లకుండా అడ్డుకోవడం, ప్రభుత్వ వ్యతిరేక శక్తులను చీల్చడం, తాను గెలవకపోయినా సరే చంద్రబాబు మాత్రం ఓడిపోకూడదన్న ధోరణి పవన్‌లో కనిపించిందంటున్నారు.
Click on Image to Read: