దుమ్ము కొట్టుకుపోయిన కోట్ల కేసుల కాగితాలు... బిక్కచచ్చిపోయిన న్యాయం!
కోర్టుల్లో పెండింగ్ కేసులు ఏ మేరకు ఉన్నాయో, వాటి పరిస్థితి ఎలా ఉందో తెలిపే నిదర్శనం ఇది. మద్రాస్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల తాలూకూ కట్టలు కట్టల పేజీలకు డిజిటల్ రూపం ఇస్తున్నారు. ఈ కాగితాలు దాదాపు 20కోట్లవరకు ఉంటాయని అంచనా. వీటిని స్కాన్ చేసి ఇమేజ్ ఫైళ్ల రూపంలో భద్రపరిచే పనిని ఒక ప్రయివేటు కంపెనీకి అప్పగించారు. 100కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీల నుండి టెండర్లను కోరి…ఒక కంపెనీకి ఈ పనిని అప్పగించామని….వచ్చే సంవత్సరం […]
కోర్టుల్లో పెండింగ్ కేసులు ఏ మేరకు ఉన్నాయో, వాటి పరిస్థితి ఎలా ఉందో తెలిపే నిదర్శనం ఇది. మద్రాస్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల తాలూకూ కట్టలు కట్టల పేజీలకు డిజిటల్ రూపం ఇస్తున్నారు. ఈ కాగితాలు దాదాపు 20కోట్లవరకు ఉంటాయని అంచనా. వీటిని స్కాన్ చేసి ఇమేజ్ ఫైళ్ల రూపంలో భద్రపరిచే పనిని ఒక ప్రయివేటు కంపెనీకి అప్పగించారు. 100కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీల నుండి టెండర్లను కోరి…ఒక కంపెనీకి ఈ పనిని అప్పగించామని….వచ్చే సంవత్సరం చివరికి దీన్ని పూర్తిచేయాల్సి ఉంటుందని మద్రాస్ హైకోర్టు ఉద్యోగి ఒకరు తెలిపారు. కోర్డు రికార్డు రూముల్లో ఈ కేసుల తాలూకూ కాగితాల కట్టలు దుమ్ముకొట్టుకుని పోతున్నాయని…పెండింగ్ కేసులు పరిష్కారం అవడానికి ఇంకా చాలాకాలం పడుతుందని ఆ ఉద్యోగి తెలిపారు.
కింది కోర్టులు తమ కేసుల వివరాలను డిజిటల్ రూపంలోకి మార్చి హైకోర్టుకి పంపితే హైకోర్టులో ఎక్కువ సమయం పట్టదని ఆయన అన్నారు. కొంతమంది న్యాయమూర్తులకు డస్ట్ ఎలర్జీ ఉండటం వలన… వారు పాత కేసుల విచారణను పక్కన పెట్టేస్తున్నారని ఆ ఉద్యోగి చెప్పారు. పాత కేసులన్నీ పేపర్లనుండి ఎలక్ట్రానిక్ రూపంలోకి మారి కంప్యూటర్‌లో ఒక్క క్లిక్ చేస్తే వచ్చేలా ఉంటే ఈ పరిస్థితి మారుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. హైకోర్టు పెండింగ్ కేసుల కాగితాలు డిజిటైజేషన్ చేస్తున్న కంపెనీ… హైకోర్టు భవనంలోనే ఈ పనిచేయాల్సి ఉంటుందని, వారికి అవసరమైన కరెంటు, ఎయిర్ కండిషనర్లు, ఇంకా ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు, వసతులను హైకోర్టే సమకూరుస్తుందని వివరించారు. మొత్తానికి దుమ్ముకొట్టుకున్న కాగితాలనుండి కేసులను కంప్యూటర్లకు ఎక్కిస్తేనైనా…న్యాయానికి ఊపిరి ఆడుతుందేమో…కేసులు పరిష్కరం అవుతాయేమో వేచి చూడాలి.
Click on Image to Read: