కోటి ఉమెన్స్ కాలేజికి.... రవీంద్రనాథ్ ఠాగూర్‌కి ఏమిటి సంబంధం!
అవును… హైదరాబాద్ కోటిలో ఉన్న ఉమెన్స్ కాలేజికి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కి…ఎవరికీ తెలియని ఒక అవినాభావ సంబంధం ఉంది. ఈ కాలేజిలో మొట్టమొదటి మహిళా ఫ్యాకల్టీగా చేరిన గిబ్స్‌కి ఆ ఉద్యోగం రావడానికి కారణం…రవీంద్రనాథ్ ఠాగూరేనట. గిబ్స్‌ని ఆ ఉద్యోగం లోకి తీసుకోమని నిజాం ప్రభువుకి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారట. ఆయన చెప్పటంతోనే గిబ్స్‌కి ఆ ఉద్యోగం వచ్చినట్టుగా… ఆమె మనుమరాలు, సర్దార్ వల్లభాయి పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరక్టర్ అరుణా బహుగుణ వెల్లడించారు. అరుణా […]
అవును… హైదరాబాద్ కోటిలో ఉన్న ఉమెన్స్ కాలేజికి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కి…ఎవరికీ తెలియని ఒక అవినాభావ సంబంధం ఉంది. ఈ కాలేజిలో మొట్టమొదటి మహిళా ఫ్యాకల్టీగా చేరిన గిబ్స్‌కి ఆ ఉద్యోగం రావడానికి కారణం…రవీంద్రనాథ్ ఠాగూరేనట. గిబ్స్‌ని ఆ ఉద్యోగం లోకి తీసుకోమని నిజాం ప్రభువుకి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారట. ఆయన చెప్పటంతోనే గిబ్స్‌కి ఆ ఉద్యోగం వచ్చినట్టుగా… ఆమె మనుమరాలు, సర్దార్ వల్లభాయి పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరక్టర్ అరుణా బహుగుణ వెల్లడించారు. అరుణా బహుగుణ శనివారం కాలేజిలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివాహానికి పూర్వం అరుణా గిబ్స్… అయిన అరుణ బహుగుణ…నాటి గిబ్స్కి మనుమరాలు అవుతారు.
మైసూరుకి చెందిన ఒక సంప్రదాయ కుటుంబానికి చెందిన గిబ్స్… ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నారు. ఒక మహిళను అధ్యాపకురాలిగా తీసుకుంటే మహిళలు ఉన్నత విద్యను అభ్యసించడానికి ముందుకు వస్తారని ఠాగూర్ భావించినట్టుగా అరుణ బహుగుణ తెలిపారు.
తన బామ్మగారు గిబ్స్ ….బాల్య వివాహానంతరం 14ఏళ్లకు భర్తను కోల్పోగా ఆమె తండ్రి ఆమెను చదువుకునేందుకు ప్రోత్సహించారని ఇంగ్లండులోని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో గిబ్స్ చదువుకున్నారని తెలిపారు. అనంతరం గిబ్స్… ఒక సందర్భంలో మైసూరులో రవీంద్రనాథ్ ఠాగూర్ని కలుసుకోగా… ఠాగూర్ ఆమె ప్రతిభని చూసి మెచ్చుకున్నారన్నారు. మహిళా విద్యని ప్రోత్సహించడానికి నిజాం ప్రభువు 1924లో తొలిమహిళా కళాశాలని నెలకొల్పారు. దాన్ని ఠాగూర్ సందర్శించినపుడు నిజాం ప్రభువు ఒక మంచి భారతీయ అధ్యాపకురాలు ఉంటే బాగుంటుందని ఆయనతో అనగా… ఠాగూర్ గిబ్స్ పేరుని సూచించారు. అలా ఆమె 1930ల్లో ఉమెన్స్ కాలేజిలో ఉద్యోగంలో చేరి, తొలి భారతీయ ఫ్యాకల్టీగా, తొలి మహిళా ఫ్యాకల్టీగా మారారని అరుణా బహుగుణ వెల్లడించారు. అప్పటివరకు ఆ విధుల్లో అందరూ విదేశీయులు, మగవారే ఉన్నారు. అప్పట్లో ఆడపిల్లలను కాలేజికి పంపాల్పిందిగా కోరుతూ….తల్లిదండ్రులను ఒప్పించడానికి గిబ్స్ చాలా కుటుంబాలను కలిశారని, ఆమె చేసిన కృషి ఫలించిందని, అలాగే తరువాత కాలంలో గిబ్స్ కాలేజి వైస్ ప్రిన్స్ పాల్ అయ్యారని బహుగుణ చెప్పారు.
Click on Image to Read: