పవన్ వైఖరి మంచిదే, కాళ్ళయినా పట్టుకోవాలి " టీడీపీ
ప్రత్యేక హోదా కోసం పోరాడాలని నిర్ణయించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమేనని టీడీపీ అభిప్రాయపడింది. రెండున్నరేళ్లుగా తాము ఏం మాట్లాడుతున్నామో ఇప్పుడు పవన్ కూడా అదే మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమా విజయవాడలో చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తమతో పాటు పోరాడం చేసేందుకు మిత్రపక్షమైన జనసేన ముందుకు రావడం సంతోషమన్నారు బోండా ఉమ. కేంద్రమంత్రులు ఎంపీలు రాజీనామా చేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనని ఇద్దరు నేతలు చెప్పారు. అయితే రాజీనామాలకు ఇది సరైన సమయం కాదనే […]
ప్రత్యేక హోదా కోసం పోరాడాలని నిర్ణయించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమేనని టీడీపీ అభిప్రాయపడింది. రెండున్నరేళ్లుగా తాము ఏం మాట్లాడుతున్నామో ఇప్పుడు పవన్ కూడా అదే మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమా విజయవాడలో చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తమతో పాటు పోరాడం చేసేందుకు మిత్రపక్షమైన జనసేన ముందుకు రావడం సంతోషమన్నారు బోండా ఉమ.
కేంద్రమంత్రులు ఎంపీలు రాజీనామా చేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనని ఇద్దరు నేతలు చెప్పారు. అయితే రాజీనామాలకు ఇది సరైన సమయం కాదనే వెనక్కు తగ్గామన్నారు. సీఎం ఆదేశిస్తే ఈక్షణమే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కేశినేని నాని, బోండా చెప్పారు. కేశినేని నాని, మురళీ మోహన్ ధనవంతులన్న పవన్ వ్యాఖ్యలను వారు తప్పుపట్టారు. కేశినేని నాని, మురళీమోహన్ 30, 40 ఏళ్లు వ్యాపారాల్లో కష్టపడి ధనవంతులయ్యారని గుర్తించుకోవాలన్నారు. హోదాకు ఎంపీ ఆర్థిక స్థితిగతులకు సంబంధం ఉండదన్నారు.
ప్రత్యేక హోదాను జుట్టు పట్టుకుని అయినా, అవసరమైతే కాళ్లు పట్టుకుని అయినా సాధించుకోవాల్సిన అవసరం ఉందని కేశినేని నాని చెప్పారు. పవన్ ప్రసంగంపై రాత్రి చంద్రబాబు పార్టీ నేతలతో సుధీర్ఘంగా చర్చించారు. పవన్ ప్రసంగంలో టీడీపీని పెద్దగా విమర్శించలేదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఒకటి రెండు విమర్శలు చేసినా అవి సహజమేనని అభిప్రాయపడ్డారు. సీబీఐకి చంద్రబాబు భయపడుతున్నారన్న వ్యాఖ్యలపై మాత్రం టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
మరోవైపు కేంద్రమంత్రి సుజనాచౌదరి కూడా పవన్ వ్యాఖ్యలపై ఫేస్ బుక్‌లో స్పందించారు. కొన్ని వారాల క్రితం రాజ్యసభలో తాను ఏం మాట్లాడానో ఇప్పుడు తన మిత్రుడు పవన్ కల్యాణ్ కూడా అదే మాట్లాడారని చెప్పారు. రాజ్యసభలో తనప్రసంగాన్ని కూడా పోస్టు చేశారు.
Click on Image to Read: