టీడీపీ అనుకూల మీడియాపై పవన్ సెటైర్లు
తిరుపతి సభలో పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన పట్ల టీడీపీ, దాని అనుకూల మీడియా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు. టీడీపీకి భుజం కాసినప్పుడు కొన్ని పెద్ద పత్రికలు తనను మెచ్చుకున్నాయన్నారు. జనసేన అభిమానులు, కార్యకర్తలు దేశం కోసం పనిచేసేవారని కథనాలు రాశారన్నారు. పవన్ కులాలు, మతాలకు అతీతమని రాశారని గుర్తు చేసుకున్నారు. కానీ అమరావతిలో రైతుల పక్షాన నిలబడి రెండు మూడు విషయాల్లో ప్రభుత్వాన్ని విమర్శించే సరికి సదరు పత్రికల తీరు మారిపోయిందన్నారు. […]
తిరుపతి సభలో పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన పట్ల టీడీపీ, దాని అనుకూల మీడియా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు. టీడీపీకి భుజం కాసినప్పుడు కొన్ని పెద్ద పత్రికలు తనను మెచ్చుకున్నాయన్నారు. జనసేన అభిమానులు, కార్యకర్తలు దేశం కోసం పనిచేసేవారని కథనాలు రాశారన్నారు. పవన్ కులాలు, మతాలకు అతీతమని రాశారని గుర్తు చేసుకున్నారు. కానీ అమరావతిలో రైతుల పక్షాన నిలబడి రెండు మూడు విషయాల్లో ప్రభుత్వాన్ని విమర్శించే సరికి సదరు పత్రికల తీరు మారిపోయిందన్నారు.
టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు మెచ్చుకున్న పత్రికలు… ప్రభుత్వాన్ని విమర్శించగానే కులాన్ని అంటగడుతూ వ్యాసం రాసిందన్నారు. సదరు పత్రిక యజమానిని ఈ విషయంలో నిలదీశానని చెప్పారు. టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు గుర్తుకు రాని కులం, మతం ఇప్పుడే గుర్తుకొచ్చిందా అని తాను ప్రశ్నించానని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శించగానే పత్రికలు ఇలా కథనాలు రాయడం తనకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మొదటి అనుభవం అని చెప్పారు. Click on Link to Read: లొసుగులు లేకుంటే భయమెందుకు?- బాబు, వెంకయ్యపై పవన్ ఫైర్ తనకు కులం లేదు, మతం లేదు అని పవన్ చెప్పారు. ఎవరైనా తనకు కులం, మతం, ప్రాంతం అంటగట్టాలని చూస్తే తనకు కోపం వస్తుందన్నారు. Click on Link to Read: భవిష్యత్తు గురించి చెప్పిన పవన్
Click on Image to Read: