Telugu Global
NEWS

భవిష్యత్తు గురించి చెప్పిన పవన్

తిరుపతి సభలో తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను పవన్ ప్రకటించారు. మూడు అంచల్లో ప్రత్యేక హోదా కోసం తన పోరాటం ఉంటుందన్నారు. తొలి విడతలో భాగంగా అన్ని జిల్లాల్లో బహిరంగసభలు పెడతామన్నారు. సెప్టెంబర్ 9న కాకినాడలో తొలి బహిరంగసభ ఉంటుందన్నారు. ఆ తర్వాత ఎంపీలు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ ఉంటుందన్నారు. అప్పటికీ దిగిరాకపోతే రోడ్డమీదకు వస్తామని హోదా ఎలా సాధించుకోవాలో చూపిస్తామన్నారు. అంత దూరం పరిస్థితిని తెచ్చుకోవద్దని రాజకీయ పార్టీలకు హితవు పలికారు. సినిమాల్లో చాలా […]

భవిష్యత్తు గురించి చెప్పిన పవన్
X

తిరుపతి సభలో తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను పవన్ ప్రకటించారు. మూడు అంచల్లో ప్రత్యేక హోదా కోసం తన పోరాటం ఉంటుందన్నారు. తొలి విడతలో భాగంగా అన్ని జిల్లాల్లో బహిరంగసభలు పెడతామన్నారు. సెప్టెంబర్ 9న కాకినాడలో తొలి బహిరంగసభ ఉంటుందన్నారు. ఆ తర్వాత ఎంపీలు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ ఉంటుందన్నారు. అప్పటికీ దిగిరాకపోతే రోడ్డమీదకు వస్తామని హోదా ఎలా సాధించుకోవాలో చూపిస్తామన్నారు. అంత దూరం పరిస్థితిని తెచ్చుకోవద్దని రాజకీయ పార్టీలకు హితవు పలికారు. సినిమాల్లో చాలా చేయవచ్చని… రౌడీలను కొట్టవచ్చు, ఆస్తులు దహనం చేయవచ్చు, హీరోయిన్లతో పాటలు పాడవచ్చన్నారు. ఇదంతా రెండున్నర గంటల్లో చేయవచ్చని… కానీ నిజజీవితంలో కొంత సమయం పడుతుందన్నారు.

తనను కొందరు రబ్బర్ సింగ్‌ అన్నారని, మరికొందరు భజన సేన అన్నారని కానీ మాట జారితే తిరిగి తీసుకోలేమన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. సీపీఐ నారాయణ జనసేనను మోదీ భజన సేన అన్నారని తాము కూడా మరుసటి రోజు ప్రెస్‌ మీట్ పెట్టి విమర్శించవచ్చని కానీ మాట జారకూడదనే ఊరుకున్నామని చెప్పారు. ఆవు మాట చెప్పి అసలు విషయాలను డైవర్ట్ చేస్తున్నారని పవన్ అన్నారు. బీజేపీనేతలకు ఆవుల మీద అంత ప్రేమ ఉంటే ఆ పార్టీ కార్యకర్తలంతా ఒక్కో ఆవును పెంచుకోవాలని పవన్ సూచించారు. తాను రైతులు, ఆడ బిడ్డల పక్షపాతినని పవన్ చెప్పారు.

హోదాపై టీడీపీ, వైసీపీ ఒకే మాట మాట్లాడాలని పవన్ సూచించారు. అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా, డిపాజిట్లు రాకపోతే ఒకలాగా, పోటీ చేయకుండా ఉంటే నాలాగా మాట్లాడడం సరికాదన్నారు. అందరూ ఓకే మాట మాట్లాడాలన్నారు. ఏపీ ఎంపీలు ముందు హిందీ నేర్చుకుని మోదీ, సోనియాకు అర్థమయ్యేలా హిందీలో వివరించాలని పవన్ సూచించారు. ఇకపై సినిమాల్లోనూ నటిస్తానని, అదే సమయంలో రాజకీయాలు కూడా చేస్తానని పవన్ ప్రకటించారు. సినిమాలు చేయకపోతే తనకు డబ్బులు రావన్నారు. ప్రేక్షకులు టికెట్లు కొంటేనే తనకు డబ్బులొస్తాయన్నారు. సర్దార్ సినిమాను సరిగా చూడలేదని అందుకే తనకు డబ్బులు రాలేదని చమత్కరించారు.

Click on Image to Read:

pawan1

pawan tirupati sabha

undavalli

jana sena

brahmini

Sudharani Boyapati

natti kumar

SRM University chancellor Pachamuthu arrested in Chennai

ysrcp praveen kumar reddy

First Published:  27 Aug 2016 12:29 PM IST
Next Story