నయీం హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం
నయీం ఎన్‌కౌంటర్ బూటకమా? అతన్ని చర్చలకు పిలిచి మట్టుబెట్టారా? నయీం ఎన్‌కౌంటర్ తరువాత అతని అనుచరులు ఇంకా మిగిలే ఉన్నారా? ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నారా? క్రాంతిసేన సెంట్రల్ కమిటీ పేరిట వెలువడిన ఓ లేఖ ఇప్పుడు ఈ ప్రశ్నలనే లేవనెత్తుతోంది. నయీం కు సన్నిహితంగా మెదిలిన ఈ బృందం సభ్యులు విడుదల చేసిన ప్రకటనలో నయీం ఎన్‌కౌంటర్ పై పలు ఆరోపణలు చేశారు. నయీంది నిజమైన ఎన్‌కౌంటర్ కాదన్నది వారి ప్రధాన ఆరోపణ. నయీంకు […]
BY admin27 Aug 2016 8:20 AM IST
X
admin Updated On: 28 Aug 2016 11:45 AM IST
నయీం ఎన్‌కౌంటర్ బూటకమా? అతన్ని చర్చలకు పిలిచి మట్టుబెట్టారా? నయీం ఎన్‌కౌంటర్ తరువాత అతని అనుచరులు ఇంకా మిగిలే ఉన్నారా? ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నారా? క్రాంతిసేన సెంట్రల్ కమిటీ పేరిట వెలువడిన ఓ లేఖ ఇప్పుడు ఈ ప్రశ్నలనే లేవనెత్తుతోంది. నయీం కు సన్నిహితంగా మెదిలిన ఈ బృందం సభ్యులు విడుదల చేసిన ప్రకటనలో నయీం ఎన్‌కౌంటర్ పై పలు ఆరోపణలు చేశారు. నయీంది నిజమైన ఎన్‌కౌంటర్ కాదన్నది వారి ప్రధాన ఆరోపణ. నయీంకు అత్యంత సన్నిహితుడైన ఓ డీఎస్పీతో అతన్ని రప్పించి, పట్టుకుని కాల్చి చంపారన్నది దారి సారాంశం. మావోయిస్టుల ఏరివేతకు పోలీసులు మా నెట్‌వర్క్‌ను వాడుకున్నారు. అవసరం తీరాక.. ఇప్పుడు మా నేతనే మట్టుబెట్టారు. కేవలం టీఆర్ ఎస్ నేతలతో ఏర్పడ్డ ల్యాండ్ సెటిల్మెంట్ల గొడవలే నయీం ప్రాణం తీశాయి. మేమిచ్చిన ఫండ్‌తో గెలిచిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు చివరికి మమ్మల్నే టార్గెట్ చేశారు. అందుకే, నయీం చావుకు ప్రతీకారం తీర్చుకుంటాం. మా టార్గెట్ టీఆర్ ఎస్ నేతలే. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఇందుకోసం అవసరమైతే మావోయిస్టులకు దగ్గరవుతామని స్పష్టం చేశారు. నయీం గ్యాంగ్ స్టర్ కాదని.. యాంటి మావోయిస్టు.. యాంటి టెర్రరిస్టు పంథాను ఎంచుకున్నాడని కొనియాడారు. ధనిక వర్గాలను టార్గెట్ చేసి.. పేదలను ఆదుకున్నాడని పొగడటం గమనార్హం. క్రాంతిసేన మహారాష్ట్ర సెంట్రల్ కమిటీ సభ్యుడు మధు, ఒడిశా సెంట్రల్ కమిటీ సభ్యుడు జగత్‌పట్నాయక్ పేరుతో విడుదలైన ఈ లేఖ విశ్వసనీయతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story