ఉప్పుగుళ్లు వేసే రకం... పవన్‌పై నారాయణ ఫైర్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సీపీఐ నారాయణ ఫైర్ అయ్యారు. తన స్వార్థం కోసం పవన్ కల్యాణ్ అభిమానులను వాడుకుంటున్నారని మండిపడ్డారు. చేతనైతే రాజకీయాలు చేయాలి లేకుంటే రజనీకాంత్‌లా ఇంట్లో కూర్చోవాలని సూచించారు. రాజకీయం కావాలో సినిమాలు కావాలో ముందు తేల్చుకోవాలని హితవు పలికారు. పవన్ కల్యాణ్ పొంగే పాలలో ఉప్పుగుళ్లు వేసే రకం వ్యక్తి అని ఎద్దేవా చేశారు. తిరుపతి సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ … సీపీఐ నారాయణ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనది […]

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సీపీఐ నారాయణ ఫైర్ అయ్యారు. తన స్వార్థం కోసం పవన్ కల్యాణ్ అభిమానులను వాడుకుంటున్నారని మండిపడ్డారు. చేతనైతే రాజకీయాలు చేయాలి లేకుంటే రజనీకాంత్‌లా ఇంట్లో కూర్చోవాలని సూచించారు. రాజకీయం కావాలో సినిమాలు కావాలో ముందు తేల్చుకోవాలని హితవు పలికారు. పవన్ కల్యాణ్ పొంగే పాలలో ఉప్పుగుళ్లు వేసే రకం వ్యక్తి అని ఎద్దేవా చేశారు.
తిరుపతి సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ … సీపీఐ నారాయణ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనది భజనసేన అని సీపీఐ నారాయణ గతంలో విమర్శించారని… తాను మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి ప్రతి విమర్శ చేయవచ్చని కానీ తాను అలా చేయలేదన్నారు. తనది ఏ పార్టీకి భజనసేన కాదని గుర్తించుకోవాలని పవన్ అన్నారు.
Click on Image to Read: