Telugu Global
NEWS

ఇది కోడలి ప్రభావమేనా?

నారా లోకేష్‌ మంత్రి కాబోతున్నారు. ఈ మేరకు స్వయంగా చంద్రబాబునాయుడే సిగ్నల్స్ ఇచ్చారు. శుక్రవారం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన లోకేష్ పనితీరు అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. మంత్రి పదవి ఇస్తారా? అని ప్రశ్నించగా…  ఊహాగానాలు అవసరం లేదని, లోకేష్ పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. లోకేశ్‌కు అవకాశమిస్తే(మంత్రిగా) ఇంకా మంచిగా ఎమర్జ్ అవుతారని అన్నారు. దీనిపై తాను సానుకూలంగా ఆలోచిస్తున్నానని తెలిపారు. అంతే కాదు అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రకటించారు చంద్రబాబు. […]

ఇది కోడలి ప్రభావమేనా?
X
నారా లోకేష్‌ మంత్రి కాబోతున్నారు. ఈ మేరకు స్వయంగా చంద్రబాబునాయుడే సిగ్నల్స్ ఇచ్చారు. శుక్రవారం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన లోకేష్ పనితీరు అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. మంత్రి పదవి ఇస్తారా? అని ప్రశ్నించగా… ఊహాగానాలు అవసరం లేదని, లోకేష్ పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. లోకేశ్‌కు అవకాశమిస్తే(మంత్రిగా) ఇంకా మంచిగా ఎమర్జ్ అవుతారని అన్నారు. దీనిపై తాను సానుకూలంగా ఆలోచిస్తున్నానని తెలిపారు. అంతే కాదు అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రకటించారు చంద్రబాబు. అయితే లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం చంద్రబాబుకు పెద్దగా ఇష్టం లేదని చెబుతున్నారు. కానీ కుటుంబసభ్యుల నుంచి మాత్రం భారీగా ఒత్తిడి ఉందంటున్నారు. పక్క రాష్ట్రంలో కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ మంత్రిగా బాగా రాణిస్తున్న నేపథ్యంలో లోకేష్‌ను కూడా బాబు కుటుంబం అలాగే చూడాలనుకుంటోంది.
లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే పవర్‌ సెంటర్లు తయారవుతాయన్న భావన చంద్రబాబుకు ఉన్నప్పటికీ… భువనేశ్వరితో పాటు కోడలు బ్రాహ్మణి కూడా లోకేష్‌కు మంత్రిపదవి ఇవ్వాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. అల్లుడు మంత్రి అయితే బాగుంటుందని బాలకృష్ణ భార్య వసుంధర కూడా బలంగా కోరుకుంటుందని, ఆమేరకు కూతురుమీద ఒత్తిడి తెస్తోందని సమాచారం. రాహుల్‌ గాంధీకి ఎదురైన అనుభవాన్ని కుటుంబ సభ్యులు చంద్రబాబుకు వివరిస్తున్నట్టు సమాచారం. యూపీఏ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో రాహుల్‌ను పెద్ద నాయకుడిగా కాంగ్రెస్ తయారు చేయలేకపోయింది. తీరా పార్టీ తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదురుక్కొంటున్న సమయంలో రాహుల్‌ను ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లారు. దీంతో ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో రాహుల్‌ రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. లోకేష్‌ విషయంలోనూ అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే ఈ రెండున్నరేళ్లలోనే లోకేష్‌ను ప్రభుత్వంలో భాగస్వామి చేయాలని సూచిస్తున్నారు. 2019లో లోకేష్‌ను పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాలని చంద్రబాబు అనుకున్నప్పటికీ ఆయన కుటుంబసభ్యులు అందుకు అంగీకరించలేదని చెబుతున్నారు. 2019లో ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేమని కాబట్టి పార్టీ ఓడిపోతే లోకేష్‌ రాజకీయ జీవితం కూడా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంటుందని, కాబట్టి ఈ లోపే లోకేష్‌ను ఒక స్థాయి నాయకుడిగా ప్రజలకు చూపించాలని కుటుంబసభ్యులు సూచించారని చెబుతున్నారు. ఈ ఒత్తిడి నేపథ్యంలో చంద్రబాబు కూడా అయిష్టంగానే లోకేష్‌ను కేబినెట్‌లోకి తీసుకునేందుకు సిద్ధపడ్డారని చెబుతున్నారు.

Click on Image to Read:

jana sena

Sudharani Boyapati

natti kumar

jayalalitha1

SRM University chancellor Pachamuthu arrested in Chennai

ysrcp praveen kumar reddy

avinash

natti kumar vs c kalyan

999

dharmana prasada rao

chandrababu naidu rains1

ambati comments

pawan vinod

harsha kumar

pinnelli ramakrishna reddy

law

tdp cabinet

ambati

First Published:  27 Aug 2016 5:23 AM IST
Next Story