తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు?
జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నాయి. మరోవైపు వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమవుతోంది. ఇక్కడే తెలంగాణ ప్రభుత్వానికి ఓ చిక్కొచ్చి పడింది. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేశ్ నవరాత్రులు కూడా ఇదే సమయంలో వస్తున్నాయి. దీంతో భద్రత విషయంలో ఎలా వ్యవహరించాలి? అన్న విషయంపై సమాలోచనలు చేస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈనెల 30 నుంచి గానీ.. లేదా సెప్టెంబరు 17 నుంచి గానీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగవచ్చు. […]
BY sarvi26 Aug 2016 2:58 AM IST
X
sarvi Updated On: 26 Aug 2016 5:36 AM IST
జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నాయి. మరోవైపు వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమవుతోంది. ఇక్కడే తెలంగాణ ప్రభుత్వానికి ఓ చిక్కొచ్చి పడింది. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేశ్ నవరాత్రులు కూడా ఇదే సమయంలో వస్తున్నాయి. దీంతో భద్రత విషయంలో ఎలా వ్యవహరించాలి? అన్న విషయంపై సమాలోచనలు చేస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈనెల 30 నుంచి గానీ.. లేదా సెప్టెంబరు 17 నుంచి గానీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగవచ్చు. మరోవైపు ఏపీ సర్కారు వచ్చేనెల 8 నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపాలని ఇప్పటికే నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అసెంబ్లీని సమావేశ పరచాలంటూ కేసీఆర్ నిర్ణయించారు. అందుకే, ఏ తేదీన సమావేశాలు నిర్వహించాలన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసు శాఖతో సమాలోచనలు జరిపిన కేసీఆర్ ఆగస్టు 30 లేదా.. సెప్టెంబరు 17 తేదీలకు సూచనప్రాయంగా మొగ్గు చూపినట్లు తెలిసింది. ఉత్తరాది రాష్ర్టాలు, పొరుగు రాష్ర్టాలు జీఎస్టీ బిల్లును ఇప్పటికే ఆమోదించిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేకంగా నిర్వహిస్తారా? లేదా సుదీర్ఘంగా నిర్వహించేందుకే మొగ్గు చూపుతారా? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
Next Story