దర్శకుడు అశోక్ కు ఒకేసారి ముగ్గురు పిల్లలు..
పిల్ల జమీందార్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అశోక్… ప్రస్తుతం అనుష్క లీడ్ రోల్ లో భాగమతి అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ హీరోకు ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టారు. అశోక్ భార్య.. ఒకేసారి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడికి (ట్రిప్లెట్స్) జన్మనిచ్చింది. దీంతో అశోక్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఓ వైపు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై పెద్ద సినిమా ఆఫర్.. మరోవైపు ఒకేసారి ముగ్గురు పిల్లలు. ఈ ఆనందాన్ని భాగమతి టీంతో […]
పిల్ల జమీందార్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అశోక్… ప్రస్తుతం అనుష్క లీడ్ రోల్ లో భాగమతి అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ హీరోకు ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టారు. అశోక్ భార్య.. ఒకేసారి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడికి (ట్రిప్లెట్స్) జన్మనిచ్చింది. దీంతో అశోక్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఓ వైపు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై పెద్ద సినిమా ఆఫర్.. మరోవైపు ఒకేసారి ముగ్గురు పిల్లలు. ఈ ఆనందాన్ని భాగమతి టీంతో సెలబ్రేట్ చేసుకున్నాడు దర్శకుడు అశోక్. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన అశోక్… తర్వాత కొరియోగ్రాఫర్ గా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 2010లో వచ్చిన ఆకాశరామన్న చిత్రంతో దర్శకుడిగా మారాడు. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. నానితో చేసిన పిల్ల జమీందార్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు… చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తాడు. గతంలో వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేయాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. తాజాగా అనుష్క లీడ్ రోల్ లో భాగమతి అనే సినిమా చేస్తున్నాడు. సైన్స్-థ్రిల్లర్ కథాంశంతో ఇది తెరకెక్కుతోంది.