ఆ ఆరుపులు ఆవిరయ్యాయా!.. బోయపాటి సుధారాణిని కమ్మేశారు..
బోయపాటి సుధారాణి. ఈ పేరు బాగా పాపులర్. రాజధాని కోసం చంద్రబాబు భూములు లాక్కోవడంపై ఆమె చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఏడాది క్రితం సోషల్ మీడియాను షేక్ చేశాయి. వాడు వీడు అంటూ ఆవేశంగా ఆమె మాట్లాడిన తీరు పరిస్థితి తీవ్రతకు అద్దంలా నిలిచింది. ”మాకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకు తప్ప వేరే వాడికి ఓటు వేయలేదు, ఇప్పుడు ఓటేసి మా నెత్తి మీదకు తెచ్చుకున్నాం. కడుపుకు అన్నం తినేవాడు ఎవడూ అలాంటి భూములు […]
బోయపాటి సుధారాణి. ఈ పేరు బాగా పాపులర్. రాజధాని కోసం చంద్రబాబు భూములు లాక్కోవడంపై ఆమె చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఏడాది క్రితం సోషల్ మీడియాను షేక్ చేశాయి. వాడు వీడు అంటూ ఆవేశంగా ఆమె మాట్లాడిన తీరు పరిస్థితి తీవ్రతకు అద్దంలా నిలిచింది. ”మాకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకు తప్ప వేరే వాడికి ఓటు వేయలేదు, ఇప్పుడు ఓటేసి మా నెత్తి మీదకు తెచ్చుకున్నాం. కడుపుకు అన్నం తినేవాడు ఎవడూ అలాంటి భూములు వదులుకోడు. వాడి పొలం ఉంటే ఇవ్వమనండి రాజధానికి ఇస్తాడేమో. ఆ పత్తిపాటి పుల్లారావు గాడు ఇస్తాడా, ఆ నారాయణగాడు ఇస్తాడా వాళ్ల భూమి ఉంటే” అంటూ బోయపాటి సుధారాణి చేసిన వ్యాఖ్యలు సంచలనమే అయ్యాయి.
రాజధానిలో చంద్రబాబు భూములు లాక్కున్న తీరును వివరించాలనుకుంటే బోయపాటి సుధారాణి వ్యాఖ్యలను తప్పకుండా ప్రస్తావిస్తుంటారు. చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన బోయపాటి సుధారాణే అంత తీవ్రంగా స్పందించారంటే మిగిలిన వారికి ఎంత కోపం ఉండాలి అని అనుకున్నారు. అయితే ఇక్కడ కూడా చంద్రబాబు మేనేజ్‌మెంట్ పనిచేసినట్టుగా ఉంది.
బోయపాటి సుధారాణే చెప్పినట్టు గతంలో రాజధాని రైతులపై బ్రహ్మాస్త్రం ప్రయోగించిన చంద్రబాబు పుష్కరాల సందర్భంగా ఆమెపై అనురాగం కురిపించారు. గతంలో తనను ఉతికి ఆరేసిన సుధారాణికి చంద్రబాబు స్వయంగా ఈనెల 21న అవార్డు అందజేశారు. “కైజాలా యాప్ బెస్ట్ సెల్ఫీ అవార్డు” పేరుతో ఫెర్రీ ఘాట్ వద్ద అందరూ చూస్తుండగానే ఆమెకు చంద్రబాబు అవార్డు అందజేశారు.
గతంలో చంద్రబాబు నీతిని ఎండగట్టిన బోయపాటి సుధారాణి కూడా అవార్డు తీసుకునేందుకు వెనుకాడలేదు. చంద్రబాబు చేతుల మీదుగానే అవార్డు తీసుకున్నారు. పైగా ఆ ఫొటోను తన ఫేస్ బుక్ టైమ్ లైన్ పే కూడా పోస్టు చేశారు. ఈ ఫొటోను చూసి నెటిజన్లు బిత్తరపోతున్నారు.
నాడు ఉరిమిన బోయపాటి సుధారాణి ఈమేనా అని కాసేపు షాక్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఆమె చర్యలను కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు కూడా. అయినా బోయపాటి సుధారాణి ఏం చేస్తారు. చంద్రబాబు మేనేజ్ చేయలేని వ్యవస్థే ఈ దేశంలో లేకుండాపోతున్న వేళ సుధారాణి ఎంత?. పైగా టీడీపీకి తప్ప ఇప్పటికి వరకు మరో పార్టీకి ఓటు వేయని వ్యక్తి ఆమె. మొత్తానికి బోయపాటి సుధారాణిని సెల్ఫీ అవార్డుతో బాబు ప్రభుత్వం కమ్మేసిందన్న మాట.
Click on Image to Read: