లావు పోలీసులకు బదిలీ గండం!
తెలంగాణ జైళ్ల విభాగం శాఖా పరమైన మార్పుల్లో భాగంగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. లావెక్కిన పోలీసులు వెంటనే బరువు తగ్గించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. బరువు తగ్గేందుకు 3 నెలలు గడువు ఇచ్చింది. ఈలోగా బరువు తగ్గకుంటే బదిలీ తప్పదని స్పష్టం చేసింది. ప్రతి జిల్లా జైలులో పనిచేస్తున్న పోలీసులు చక్కటి శరీరాకృతిని కలిగి ఉండాలని సూచించింది. అధిక శరీర బరువు కలిగిన పోలీసులు ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్షణం […]
BY sarvi24 Aug 2016 9:52 PM GMT
X
sarvi Updated On: 24 Aug 2016 10:04 PM GMT
తెలంగాణ జైళ్ల విభాగం శాఖా పరమైన మార్పుల్లో భాగంగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. లావెక్కిన పోలీసులు వెంటనే బరువు తగ్గించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. బరువు తగ్గేందుకు 3 నెలలు గడువు ఇచ్చింది. ఈలోగా బరువు తగ్గకుంటే బదిలీ తప్పదని స్పష్టం చేసింది. ప్రతి జిల్లా జైలులో పనిచేస్తున్న పోలీసులు చక్కటి శరీరాకృతిని కలిగి ఉండాలని సూచించింది. అధిక శరీర బరువు కలిగిన పోలీసులు ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్షణం తీరికలేని పని ఒత్తిడితో ఊపిరి సలపని పోలీసులకు ఊబకాయం ప్రమాదకరంగా మారింది. అధిక బరువు కారణంగా గుండెపోటు, రక్తపోటు, మోకాళ్ల సమస్యలు వస్తున్నాయి. ఇది సిబ్బంది పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.
అందుకే, ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్న పోలీసులంతా వెంటనే బరువు తగ్గాలని ఆదేశాల్లో పేర్కొంది. 85 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నవారంతా వెంటనే డీజీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇందుకోసం 3 నెలల గడువు ఇచ్చింది. ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న జైళ్లలో పనిచేస్తోన్న సిబ్బందిలో ఎవరెవరు ఎంత బరువు ఉన్నారు అన్న సమాచారం జైళ్ల డీజీ కార్యాలయానికి చేరిందని సమాచారం. ఇప్పటికే వరంగల్ జైలులో పనిచేస్తున్న ఊబకాయంతో బాధపడుతున్న 31 మంది సిబ్బంది డీజీ కార్యాలయంలో రిపోర్టు చేసినట్లు తెలిసింది. వారందరికీ 3నెలల గడువుఇచ్చిన ఉన్నతాధికారులు గడువులోగా బరువు తగ్గాలని ఆదేశాంచారు. ఆదేశాలు పాటించకపోతే.. బదిలీ తప్పదని హెచ్చరించారు. మరోవైపు 3 నెలల్లో 85 కిలోల లోపు బరువు తగ్గకుంటే బదిలీ తప్పదన్న భయంతో సిబ్బంది కసరత్తు మొదలెట్టారు. మరోవైపు 85 కిలోలకు సమీపంలో ఉన్నవారు వ్యాయామంలో భాగంగా ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.
Next Story