మీడియా.... న్యాయవాదుల, న్యాయ మూర్తుల పేర్లను వెల్లడించవద్దు!
కోర్టు కేసులకు సంబంధించి విచారణ, తీర్పులు, న్యాయమూర్తుల వ్యాఖ్యలు… తదితర వార్తలను రాసేటపుడు సాధారణంగా ఆయా న్యాయవాదుల, న్యాయమూర్తుల పేర్లను మీడియా ప్రస్తావించడం జరుగుతోంది. అలా వారి పేర్లు తరచుగా బయటకు వస్తుంటాయి. అయితే మద్రాస్ హైకోర్టు బెంచ్ ఈ విషయంలో కొన్ని ప్రత్యేక సూచనలు చేసింది. కోర్టు వార్తలను ప్రచురించే సమయంలోనూ, ప్రసారం చేసేటపప్పుడూ న్యాయవాదుల పేర్లను పేర్కొనవద్దని కోరింది. ఈ మేరకు మార్గదర్శకాలను మీడియా సంస్థలకు పంపాల్సిందిగా కోర్టు… రిజిస్ట్రార్ ని ఆదేశించింది. అలా పేర్లను […]
కోర్టు కేసులకు సంబంధించి విచారణ, తీర్పులు, న్యాయమూర్తుల వ్యాఖ్యలు… తదితర వార్తలను రాసేటపుడు సాధారణంగా ఆయా న్యాయవాదుల, న్యాయమూర్తుల పేర్లను మీడియా ప్రస్తావించడం జరుగుతోంది. అలా వారి పేర్లు తరచుగా బయటకు వస్తుంటాయి. అయితే మద్రాస్ హైకోర్టు బెంచ్ ఈ విషయంలో కొన్ని ప్రత్యేక సూచనలు చేసింది.
కోర్టు వార్తలను ప్రచురించే సమయంలోనూ, ప్రసారం చేసేటపప్పుడూ న్యాయవాదుల పేర్లను పేర్కొనవద్దని కోరింది. ఈ మేరకు మార్గదర్శకాలను మీడియా సంస్థలకు పంపాల్సిందిగా కోర్టు… రిజిస్ట్రార్ ని ఆదేశించింది. అలా పేర్లను వెల్లడించడం… న్యాయవాదుల వృత్తిపరమైన సామర్ధ్యానికి పరోక్ష ప్రచారం చేసినట్టే అవుతుందని…జస్టిస్ నూతి రామ్మోహన్రావు, ఎస్ఎస్ సుందర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. అలాగే అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప న్యాయమూర్తుల పేర్లను సైతం వెల్లడించవద్దని సూచించింది.
న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం మేరకు ఆయా విధులను నిర్వర్తిస్తుంటారని, వారి పేర్లు వెల్లడించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. న్యాయవాది భాస్కర్ ముత్తురాం వేసిన…ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చిన సందర్భంలో ధర్మాసనం ఈ మేరకు కోర్టు నిర్వహణా విభాగానికి ఆదేశాలు జారీచేసింది.
Click on Image to Read: